ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ లోపలే ఎదురవుతున్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ (Janasena )కి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు (Janasena MLAS) అవినీతి ఆరోపణలలో చిక్కుకోవడం పవన్ దృష్టికి వచ్చిన వెంటనే ఆయన సీరియస్ అవ్వడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో పవన్, పార్టీకి నష్టమూ, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడానికి దారి తీసేలా ఉన్న ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Vallabhaneni Vamsi Wife : రాజకీయాల్లోకి వంశీ భార్య..?
జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు అందిస్తున్న సేవల పనితీరు, వారి కుటుంబ సభ్యుల జోక్యం, ఇసుక–మద్యం లావాదేవీలలో ప్రమేయం వంటి అంశాలపై పవన్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రాథమిక సమాచారం సేకరించారు. దీనికి తోడు, ఒక ప్రముఖ సర్వే సంస్థను నియమించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల వివరాలతో సహా, వారి నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాలను ఈ సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే పవన్ తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
ఈ నివేదికల ఆధారంగా పవన్ కళ్యాణ్ జూన్ మూడో వారం లో జనసేన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ తనకు నమ్మకం ఉన్న ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే వారిని ప్రోత్సహించరన్న దృక్పథంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. దీంతో జనసేనలో తిరుగులేని శుద్ధి ప్రక్రియ మొదలవుతుందా? అనే ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.