Site icon HashtagU Telugu

janasena : జనసేనకు 24 సీట్లు మాత్రమే దక్కడంపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

Pawan Kalyan

Pawan is a key reference for Janasainiks

 

అప్పట్లో ఓ పది సీట్లన్నా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమన్న జనసేనాని..

జనసేన(janasena)కు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan) పేర్కొన్నారు. చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 – 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. అయితే, 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు.

2019లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్ గానే చూడొద్దని అన్నారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టిడిపి(tdp) ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా, 24 అసెంబ్లీ స్థానాలకు గానూ శనివారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. జనసేనానితో పాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, రానున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ తొలి జాబితాను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇరువురు నేతలు కలిసి జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. తొలి జాబితాలో చంద్రబాబు 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మిగిలిన అభ్యర్థుల పేర్లను పవన్ తర్వాత ప్రకటించనున్నారు.

read also : TDP- Janasena Alliance : పొత్తు కోసం చాలా కష్టపడ్డాను – చంద్రబాబు