Pawan in BJP’s strategy : సోము వ్యాఖ్య‌ల‌తో పొత్తుపై కొత్త కోణం!

ఏపీ రాజ‌కీయ చిత్రాన్ని ప‌వ‌న్  మార్చేస్తున్నారు. ఆయ‌న ఇచ్చే స్టేట్మెంట్ల పొత్తుల‌పై (Pawan in BJP's strategy) చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 04:25 PM IST

ఏపీ రాజ‌కీయ చిత్రాన్ని ఎప్పటిక‌ప్పుడు ప‌వ‌న్  మార్చేస్తున్నారు. ఆయ‌న ఇచ్చే స్టేట్మెంట్ల ఆధారంగా పొత్తుల‌పై (Pawan in BJP’s strategy) చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం రేస్ లో లేనంటూ ఇటీవ‌ల ఆయ‌న చేసిన కామెంట్ టీడీపీతో పొత్తు ఉంటుంద‌న్న సంకేతం ఇచ్చింది. ప్ర‌స్తుతం ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చేస్తోన్న వారాహి యాత్ర సంద‌ర్భంగా సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటానంటూ ముక్తాయించారు. దీంతో పొత్తు ప్ర‌స‌క్తి ఉండ‌ద‌ని చ‌ర్చ మొద‌ల‌యింది. దానికి ఆజ్యంపోసేలా తాజాగా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప‌రోక్షంగా పొత్తుల గురించి ప్ర‌స్తావించారు. అవినీతి, కుటుంబ పార్టీల‌తో కలిసి ప‌నిచేసే అవ‌కాశం లేద‌ని తేల్చేశారు.

ప‌వ‌న్  స్టేట్మెంట్ల ఆధారంగా పొత్తుల‌పై ..(Pawan in BJP’s strategy)

జ‌న‌సేనాని భాష‌లో కుటుంబ పార్టీలుగా వైసీపీ, టీడీపీ ఉన్నాయి. అవినీతికి పాల్ప‌డిన పార్టీలుగా ఆ రెండు పార్టీల‌ను ప‌వ‌న్ విమ‌ర్శించిన సంద‌ర్బాలు అనేకం. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా అవినీతి పార్టీగా టీడీపీని చిత్రీకరించారు ప‌వ‌న్. ఆ విష‌యాన్ని సోమ‌వీర్రాజు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద ప్ర‌తిరోజూ జ‌న‌సేనాని అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంద‌రు బ‌రితెగించి అక్ర‌మాలు, అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అంతేకాదు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న రౌడీ, గుండా రాజ్యంలా ఉంద‌ని విరుచుకుప‌డుతున్నారు. అంటే, ఆ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో క‌లిసి ప‌నిచేయ‌రు. అంటే, బీజేపీ కూడా ఆ పార్టీకి (Pawan in BJP’s strategy) దూరంగా ఉంటుంది.

ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తును కొన‌సాగిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌న‌ప్ప‌టికీ పొత్తు ఉంద‌ని చెప్ప‌డాన్ని చూస్తున్నాం. అవీనితి పార్టీల‌తో పొత్తు ఉండ‌ద‌ని చెబుతోన్న సోము వీర్రాజు జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తామ‌ని చెబుతున్నారు. అంటే, రాబోవు ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాయ‌ని సంకేతాలు ఇస్తున్నారు. దానికి అనుగుణంగా ప‌వ‌న్ తాజా కామెంట్స్ ఉన్నాయి. ఆ రెండు పార్టీల ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ ను ప్ర‌క‌టించ‌డానికి రంగం సిద్ధమ‌వుతోంది. ఆ మేర‌కు బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. అందుకే, తాజాగా సోమువీర్రాజు పొత్తుల‌పై  (Pawan in BJP’s strategy) ప‌రోక్ష సంకేతాల‌ను ఇస్తూ టీడీపీతో క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని చెబుతున్నారు.

Also Read : Pawan Kalyan: ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో నా వ్య‌క్తిగ‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌ ఉంటుంది.. జ‌న‌సేన జెండా ఎగ‌రేయాలి..

తెలుగుదేశం పార్టీతో క‌లిస్తే, ప‌వ‌న్ సీఎం రేస్ లో లేన‌ట్టే. కానీ, సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటానంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. అంటే, బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానినికి ఆయ‌న సుముఖంగా ఉన్నార‌ని జ‌న‌సైనికుల భావ‌న‌. ఒక వేళ బీజేపీ, జ‌న‌సేన కూట‌మి గా ఎన్నిక‌ల‌కు సిద్ద‌మైతే, ప్ర‌ధాన పార్టీలు వైసీపీ, టీడీపీ ఒంట‌రిగా రంగంలో ఉంటాయి. అప్పుడు కాపు ఓటు బ్యాంకును కీల‌కం కానుంది. అప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద ఉన్న వ్య‌తిరేక ఓటు చీలిపోనుంది. ఫ‌లితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ల‌బ్దిపొందుతార‌ని ప‌వ‌న్.(Pawan in BJP’s strategy) అంచ‌నా. అందుకే, టీడీపీతో క‌లిసి వెళ్లాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ బీజేపీ, కేసీఆర్ బ్రేక్ లు వేస్తున్నారు. వాటిని కాద‌ని ప‌వ‌న్ టీడీపీతో క‌లిస్తారా? అంటే సాధ్య‌ప‌డ‌ద‌ని తెలుస్తోంది.

Also Read : Janasena Mega plan :`సుఫారీ` సుడులు! ప‌వ‌న్ `హ‌త్య‌కు కుట్ర నిజ‌మా?