Pawan- Anitha Meeting : ఒక్క పిక్ తో అందర్నీ నోర్లు మూయించిన హోంమంత్రి అనిత..

Anitha - Pawan Meeting : గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు

Published By: HashtagU Telugu Desk
Anitha Pawan

Anitha Pawan

రెండు రోజులుగా హోంమంత్రి అనిత ( Home Minister Anitha ) వైరల్ గా మారింది..దీనికి కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలే. ఇటీవల పిఠాపురం లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల పోలీస్ శాఖ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవి (Home Minister Post)ని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని, వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నిజాయతీగా ఉండాలన్న విషయాన్ని గట్టిగా చెప్పిన ఆయన, పోలీసు అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకొని హోంమంత్రి అనిత పై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అలాగే మందకృష్ణ మాదిగ (Madhakrishna Madiga) సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏదైనా సమస్య ఉంటే సీఎం దృష్టికి తీసుకురావాలి గానీ, బహిరంగవేదికలో ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై పవన్ ఇలా కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. హోం మంత్రిని విమర్శించడం అంటే, సీఎం ను విమర్శించినట్లేనని, సామాజిక న్యాయమన్న పవన్ కళ్యాణ్ మాదిగలకు ఏవిధంగా న్యాయం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇలా అనేకమంది అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో అనిత ఈరోజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి..తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నోర్లు మూతపడేలా చేసారు.

సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై ఇరువురూ చర్చించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు. తన కూతురు కన్నీళ్లు చూసే తాను ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశానని పవన్ తెలిపారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు అనిత చెప్పారు. తాను కూడా ఫేక్ పోస్ట్ బాధితురాలినేనని అన్నారు. అలాగే, జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం శ్రమించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ మేరకు అనిత సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్బంగా దిగిన పిక్స్ ను పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారి నోర్లు మూతపడేలా చేసారు.

Read Also : KTR: జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను.. కేటీఆర్ వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

  Last Updated: 07 Nov 2024, 06:29 PM IST