Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ బాధితులకు పవన్ సాయం!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్  విశాఖ షిప్పింగ్ హార్బర్ బోట్ యజమానుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.

  • Written By:
  • Updated On - November 21, 2023 / 12:32 PM IST

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా ధన నష్టం జరిగింది. దాదాపు 60కి పైగా బో ట్ల దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్  విశాఖ షిప్పింగ్ హార్బర్ బోట్ యజమానుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.  JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వచ్చే రెండు మూడు రోజుల్లో  పవన్ కళ్యాణ్ సాయం చేస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.

కాగా విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి లంగరు వేసిన బోటులో ఒక యూట్యూబర్ మద్యం పార్టీ ఇచ్చారని పోలీసులకు సమాచారం అందింది. మద్యం పార్టీ సందర్భంగా అక్కడ ఘర్షణ కూడా జరిగిందని తెలిపింది. దీంతో యూట్యూబర్ కోసం వెతుకుతున్నారు. మద్యం మత్తులో ఘర్షణ పడి ఈ ప్రమాదానికి కారణమా? లేక మరేదైనా? అన్నది మాత్రం పోలీసులు విచారిస్తున్నారు.

నిన్న అర్థరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నలభై మత్స్య కారుల బోటు తగలబడి కోట్ల రూపాయల నష్టం వాటిల్లి నట్లు తెలిసింది. యూట్యూబర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు నలభై కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

Also Read: Facebook: ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త