Red Sandalwood Smuggling : పెద్ద తలకాయల ఫై పవన్ ఫోకస్..

శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం దుంగలను స్లగ్మర్లు ఎక్కడ దాచి పెడుతున్నారో తక్షణమే గుర్తించాలని

Published By: HashtagU Telugu Desk
Pawan Red

Pawan Red

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. రోజుకు కనీసం నాల్గు గంటలైన నిద్ర పోతున్నాడా..? లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రోజు రకరకాల అంశాల ఫై అధికారులతో సమీక్షలు జరుపుతూ..ఎక్కడిక్కడే నిర్ణయాలు తీసుకుంటూ..కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిన్నటి వరకు కాకినాడ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించి అనేక సమస్యలపై అధికారులతో మాట్లాడారు. ఆ సమస్యలను తీర్చే విధంగా చూడాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రాష్ట్రంలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అధికారులతో సమీక్షా జరిపారు. కేవలం ఎర్రచందనం (Red Sandal ) మాత్రం పట్టుకోవడం కాదు దీని వెనుకున్న పెద్ద తలకాయలును కూడా పట్టుకోవాలని సూచించారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం దుంగలను స్లగ్మర్లు ఎక్కడ దాచి పెడుతున్నారో తక్షణమే గుర్తించాలని , ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుకన్నా ఎవర్ని వదిలిపెట్టకూడదన్నారు. అడవుల్లోని సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు.

Read Also : Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇకలేనట్లేనా..? హరీష్ శంకర్ ఏమన్నాడంటే..!!

  Last Updated: 05 Jul 2024, 08:47 PM IST