AP : మా భూముల పట్టాపుస్తకాలపై నీ ఫోటో ఎందుకు..? జగన్ కు పవన్ సూటి ప్రశ్న..

పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటోలు ముద్రించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 10:19 AM IST

ఏపీ ఎన్నికల ప్రచారం(AP Electionss)లో గబ్బర్ సింగ్ ..గూస్ బూబ్స్ చేస్తున్నాడు…ఏసీ గదుల్లో ఉండాల్సిన పవన్ కళ్యాణ్ (Pawan kalyan).. మండుఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలే నాకు ముఖ్యం..వారి క్షేమ శ్రేయస్సే నా బాధ్యత అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి..175 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ..ఒకే ఒక స్తానం లో విజయం..ఇంత దారుణ ఫలితాలు వచ్చినపుడు ఏ పార్టీ నేత కూడా పార్టీని నడిపాడు..ఏదొక పార్టీలో విలీనం చేసి తన దారి తనుచూసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆలా చేయలేదు. పోయినచోటే వెతుక్కోవాలి అనే తీరుగా నేడు కూటమి ఏర్పాటు చేసి..విజయం కోసం తన అభ్యర్థులను సైతం తగ్గించుకొని ఈరోజు మండు ఎండలో కూటమి విజయం కోసం కష్టపడుతున్నారు. పవన్ పడుతున్న కష్టం చూసి అభిమానులే కాదు తోటి కళాకారులు, ప్రజలు సైతం ఈసారి పవన్ విజయాన్ని ఎవరు ఆపలేరంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ తనకు ఆరోగ్యం బాగాలేనప్పటికీ..ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తేజరిగే మంచి గురించి వివరిస్తూ..ఐదేళ్ల పాటు జగన్ చేసిన నిలువు దోపిడీ గురించి ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. నిన్న పి దొంతమూరు వెల్దుర్తి సెంటర్లో ఏర్పాటు చేసిన రోడ్ షో లో పవన్ కళ్యాణ్ వైసీపీపై, జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటోలు ముద్రించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మన భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర ఉండాలి కానీ జగన్ ఫోటో ఏమిటంటూ ప్రశ్నించారు.

ఇకపై ఆస్తులకు సంబంధించి దస్తావేజులు ఉండవని, అన్ని సర్వర్ లోనే ఉంటాయని జగన్ చెబుతున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ వైసిపి మళ్ళీ అధికారంలోకి వస్తే మనందరి ఆస్తులు పోతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. మన ఆస్తికి సంబంధించిన పత్రాలు మన దగ్గర ఉండాలని, అలా కాకుంటే ఇది నా ఆస్తి అని మనం రుజువు చేసుకోవాలా .. ఇది ఎక్కడ న్యాయం అంటూ ప్రశ్నించారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకే దిక్కు లేనప్పుడు అసైన్డ్, డి ఫారం పట్టా భూములను వైసిపి నాయకులు మిగులుస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మా భూముల మీ పెత్తనం ఏంటి అని…ఇవన్నీ పోవాలంటే కూటమి విజయం సాదించాలని..లేకపోతే మీకంటూ ఏమి ఉందంటూ పవన్ హెచ్చరించారు.

Read Also : Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు