లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ లో పర్యటించారు. కాకినాడ నుండి ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి ఉదయ్ కు మద్దతుగా ప్రచారం చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కాకినాడ ఈరోజు మద్యానికి, గంజాయికి, బియ్యం స్మగ్లింగ్ కు, డీజిల్ అక్రమ రవాణాకు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు, బ్లేడ్ బ్యాచ్ లకు అడ్డాగా మారిందని ..ఊసరవెల్లి లాంటి చలమలశెట్టి సునీల్ వంటి వ్యక్తులను కాకినాడ పార్లమెంటులో గెలిపించకూడదన్నారు. ఈ ఎన్నికల్లో మీరు భవిష్యత్ కోసం ఓటేయండి… రాష్ట్రాన్ని కాపాడండి అని పిలుపునిచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే ద్వారంపూడి పాదముద్రలు కనిపిస్తున్నాయని, ప్రతి చోటా గంజాయి మాఫియా మొదలుపెట్టాడని, ఈ ప్రాంతాన్ని అక్రమాలకు కేంద్రంగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేదని, 2019లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడే ఉన్నానని, పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించానని పవన్ చెప్పుకొచ్చారు. మన ముఖ్యమంత్రి దేశం దాటి వెళ్లాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాలని, అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉన్నాడని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. నా నేలను, నా దేశాన్ని కాపాడుకోవాలనేదే నా తపన. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చి అందరితో పచ్చి బూతులు అనిపించుకోవాల్సిన అవసరం లేదు నాకు… కానీ ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాను. నేను ఓటు అడుగుతోంది నా కోసం కాదు, మీ భవిష్యత్ కోసం మీరు ఓటేయండి ‘ అని పవన్ తెలిపారు.
Read Also : Election Campaign : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం