Pawan Delhi Tour: ఢిల్లీ బీజేపీ పిలుపు ఉత్తదే

సోషల్ మీడియా వచ్చిన తరువాత నిజాలను ఏరుకోవాల్సి వస్తుంది

Published By: HashtagU Telugu Desk
Political parties NTR

Pawan Kalyan

సోషల్ మీడియా వచ్చిన తరువాత నిజాలను ఏరుకోవాల్సి వస్తుంది. గాసిప్స్ కు మోతాదు ఎక్కువ అయింది. జనసేన , ఆ పార్టీ అధినేత ప్రోగ్రామ్స్ మీద ఎవరిస్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకు పవన్ ఢిల్లీ వెళ్లాడని బీజేపీ అగ్రనేతలు పిలిచారని న్యూస్ వైరల్ అయింది. ఎయిర్పోర్ట్ లో వెళుతున్న పాత వీడియోను వైరల్ చేశారు. చాలా మంది నిజమే అనుకున్నారు. సీన్ కట్ చేస్తే బీజేపీ అగ్రనేతలు పెద్దగా పవన్ వ్యాఖ్యలను పట్టించుకోలేదని ఆలస్యంగా వెలుగు చూసింది. బీజేపీ కీలక లీడర్ కు వద్ద ఇదే విషయం ప్రస్తావిస్తే నడ్డా, సునీల్ దేవడర్ మాత్రమే ఫోన్లో మాట్లాడినట్టు చెప్పారు.

తొలి నుంచి పవన్ ను బీజేపీ ఢిల్లీ పెద్దలు లైట్ గా తీసుకున్నారు. మోడీ, అమిత్ షా ను కలవడానికి ఆయనకు అవకాశం దొరకలేదు. మూడేళ్ళుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ పవన్ కు కలిసే ఛాన్స్ రాలేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరువాత పవన్ ను చాలా లైట్ గా ఢిల్లీ బీజేపీ పెద్దలు తీసుకున్నారు. జనసేన పార్టీని విలీనం చేయాలని చాలాకాలంగా పవన్ మీద ఒత్తిడి ఉంది. ఆ విషయాన్ని రెండేళ్ల క్రితం పవన్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ కండిషన్ కు అంగీకరిస్తే పవన్కు కలిసే అవకాశం లభిస్తుందని బీజేపీలోని కీలక లీడర్లు చెపుతున్న మాట.

బీజేపీ, జనసేన మధ్య చాలా గ్యాప్ ఉంది. అందుకే పవన్ దూరం జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు కొత్త గేమ్ ఆడుతున్నారు. మొత్తం మీద పవన్ ఢిల్లీ పిలుపు ఉత్తదే. ఆయన్ను ఎవరు పిలవలేదు. ఎక్కడికి పవన్ వెళ్ళలేదు. మంగళగిరి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. కానీ మరోలా ఆయన ఢిల్లీ టూర్ గురించి ప్రచారం జరిగింది. సొంత డబ్బా కోసం లీకులు అలా ఇచ్చారు అని కొందరు అంటే, టీడీపీ లోని కొందరు చేసిన ప్రచారంగా మరికొందరు అంటున్నారు. బీజేపీ ఏపీ లీడర్లు మాత్రం మౌనంగా జరుగుతున్న ఉత్తుత్తి ప్రచారంను వినడం హైలెట్ పాయింట్.

  Last Updated: 21 Oct 2022, 04:08 PM IST