Site icon HashtagU Telugu

Pawan : సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా..? – పవన్

Pawan Jagan Siddam

Pawan Jagan Siddam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..వైసీపీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ఫై నిప్పులు చెరిగారు. జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా ఆయన పట్టించుకోరు..ఇదేనా జగన్ అంటూ పవన్ విరుచుకపడ్డారు.

ఏపీ సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని విమర్శించారు. ‘మమ్మల్ని జగన్ కౌరవులు అంటున్నారు. ఇది కలియుగం. కౌరవులు పాండవులతో పోల్చుకోకండి. జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం..? అని ప్రశ్నించారు. అర్జునుడు తన ఆడపడుచుల్ని రక్షించాడు కానీ, ఎప్పుడూ తూలనాడలేదు. సొంత చెల్లి గురించి నీచంగా మాట్లాడుతుంటే ఎంకరేజ్‌ చేసే వ్యక్తి జగన్‌. సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వడు. సొంతబాబాయిని దారుణంగా చంపేసిన నిందితుల్ని వెనకేసుకొస్తాడు. వివేకా కుమార్తె సునీత తనకు రక్షణ లేదు.. చంపేస్తారని భయంగా ఉందని చెబుతున్నా పట్టించుకోడు. అలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నారు. ఎవరు మంచి వాళ్లో, ఎవరు దోపిడీదారులో ప్రజలే నిర్ణయిస్తారు అని పవన్ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది కాకుండా పోటీ చేసే అన్ని చోట్లా జనసేన గెలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ సర్కారును స్థాపిస్తున్నాం. గతంలో చిన్న పార్టీలతోనే సీట్ల షేరింగ్ కష్టమైంది. టీడీపీతో ఇంకొంచెం టైం పడుతుంది. అన్ని చోట్లా గెలవాలి. అందరికీ పదవులొచ్చేలాగే ముందుకెళ్తాం. ఎవరినీ మర్చిపోం.

పదవులపై నాకు ఆశలేదు. అడ్డదారులు తొక్కి అడ్డగోలుగా సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. సిద్ధం పేరుతో జగన్‌ రాష్ట్రమంతా పోస్టర్లు పెడుతున్నారు. జగన్‌ అబద్ధాలు చెప్పబోనన్నారు.. కానీ, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు, మెగా డీఎస్సీతో పాటు అనేక హామీలు ఇచ్చారు. ఏవీ నెరవేర్చలేదు. అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు.. కానీ, ఒక రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. జగన్‌ ఎన్ని మోసాలు, మాయలు చేసినా వాటన్నింటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకుందాం. మనందరం కలిసి దుర్మార్గపు పాలనను అంతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ‘అని పేర్కొన్నారు.

Read Also : AP : జనసేన తీర్థం పుచ్చుకోవడమే ఆలస్యం..జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలశౌరి