BRO : ఏపీలో ఆ రెండు చోట్ల బ్రో షోస్ ను నిలిపివేశారు…

కావలిలోని లతా థియేటర్ లో సౌండ్ సిస్టమ్, AC లు ఫెయిల్ కావడంతో యాజమాన్యం సినిమాను నిలిపివేసింది

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 06:11 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ లు నటించిన మూవీ బ్రో (BRO). సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (జులై 28న) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అంత కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగగా..సెకండ్ హాఫ్ అంత కూడా ఎమోషనల్ సన్నివేశాలతో సాగింది. దీంతో థియేటర్స్ నుండి వచ్చే ప్రతి ప్రేక్షకుడి సూపర్ బ్రో అంటూ వస్తున్నారు. ఈ సినిమాను పీపూల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాగా కొన్ని చోట్ల మాత్రం థియేటర్స్ లలో సాంకేతిక కారణాలు ఏర్పడడం తో షోస్ రద్దు చేసారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కావలిలోని లతా థియేటర్ (Lath Theater) లో సౌండ్ సిస్టమ్, AC లు ఫెయిల్ కావడంతో యాజమాన్యం సినిమాను నిలిపివేసింది. దీంతో పవన్ అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యానికి.. పవన్ అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో థియేటర్ వద్దకు పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని అదుపు చేసారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని శ్రీదేవి థియేటర్ (Sridevi Theater) లో కూడా బ్రో షోస్ ను నిలిపివేశారు. పలు సాంకేతిక కారణాలతో షో ఆగిపోగా.. ఉదయం నుంచి షో వేయకపోడవంతో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థియేటర్ యాజామాన్యం సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద అక్కడక్కడా పలు అవాంతరాలు ఏర్పడినప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో ఫ్యాన్స్ , చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Read Also : Anikha Surendran : హద్దులు దాటేస్తున్న అనేకా సురేంద్రన్