Pawan Tour Postponed : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన కు బ్రేక్..

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 11:31 PM IST

జనసేన శ్రేణులను అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిత్యం నిరుత్సాహ పరుస్తూ వస్తున్నారు. ఇది రోజుది కాదు పార్టీ (Janasena) పెట్టిన నాటి నుండి ఇదే వరుస..పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటన నుండి ఇప్పుడు టీడీపీ (TDP) తో పొత్తు వరకు అన్ని కూడా జనసేన శ్రేణులను ఎంతో కొంత నిరుత్సహ పరుస్తూనే ఉంది. కార్యకర్తలు , నేతలు ఎంతో అనుకుంటే..టక్కున పవన్ వారి అంచనాలు , కోర్కెలపై నీళ్లు చల్లుతారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పవన్ ఈపాటికే ప్రజల్లోకి పూర్తి స్థాయి లో వెళ్ళాలి కానీ..ఆయన మాత్రం నిదానముగా ఉన్నారు. ఇక అంత సెట్ అయ్యింది..రేపటి నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు..ఓటమి చెందిన దగ్గరి నుండి ప్రచారం మొదలుపెట్టబోతున్నారని అంత సంతోష పడ్డారు. ఈ మేరకు నేతలు , శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పవన్ మాత్రం చివరి నిమిషంలో పర్యటన వాయిదా (Pawan AP Tour) వేసి నిరాశ పరిచారు.

ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం- పవన్ కల్యాణ్ ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించట్లేదని, అందువల్లే పవన్ కళ్యాణ్ తన భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది.

We’re now on WhatsApp. Click to Join.

భీమవరంల్ని విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందని నాయ‌కులు విమ‌ర్శించారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులతో అనుమతుల విషయంలో మెలికలుపెట్టిస్తున్నారని నాయ‌కులు మండిప‌డ్డారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడాన్ని ఖండిస్తున్నామ‌ని జ‌న‌సేన నాయ‌కులు చెప్పుకొచ్చారు. కాగా, గ‌తంలోనూ చంద్ర‌బాబును జైలుకు త‌ర‌లించిన‌ప్పుడు.. ప‌రామ‌ర్శించేందుకు హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను రోడ్డు మార్గంలో వ‌చ్చేందుకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. అప్ప‌ట్లోనూ త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న ప‌వ‌న్‌.. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు భీమ‌వ‌రంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన స‌భ‌ను కూడా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల‌.. జ‌న‌సేన నాయ‌కులు మండిప‌డుతున్నారు. మరికొంతమంది మాత్రం హెలీప్యాడ్ కు అనుమతి ఇవ్వకపోతే రోడ్డు మార్గాన వస్తే బాగుండు కదా..అంతేకాని పర్యటన వాయిదా వేసుకోవడం ఎందుకు..? ఇప్పుడు దీనిని అలుచుగా చేసుకొని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తారు కదా..? ఇలా ఎన్నిసార్లు వైసీపీ నేతల తో మాటలు అనిపించుకోవాలి..? అని జనసేన శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : RGV Thanks to Lokesh : వ్యూహం రిలీజ్ కు సహకరించినందుకు..!!