Pawan Kalyan : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారు…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బీమవరం పర్యటన (Bhimavaram Tour) ఖరారైంది. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించట్లేదని, […]

Published By: HashtagU Telugu Desk
Pawan Jagan Siddam

Pawan Jagan Siddam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బీమవరం పర్యటన (Bhimavaram Tour) ఖరారైంది. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అధికారులు అనుమతించట్లేదని, అందువల్లే పవన్ కళ్యాణ్ తన భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పార్టీ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించింది. ఆ తర్వాత మూడు రోజుల పాటు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ ఉభయ గోదావరి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఇక అధికారుల నుండి అనుమతులు రావడం తో ఈ నెల 20, 21 తేదీలలో పర్యటన కు ఫిక్స్ అయ్యారు. నేడు పవన్ వైజాగ్ లో పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాత్రికి నోవాటెల్‌లో బస చేస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన పార్టీ నేతలతో దిశానిర్దేశం చేసారు.

Read Also : Daily Puja: పూజకు కొన్ని రూల్స్ ఉన్నాయట.. ఆ తప్పు అస్సలు చేయొద్దట!

  Last Updated: 18 Feb 2024, 06:44 PM IST