Site icon HashtagU Telugu

Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?

Pawan Adavitalli

Pawan Adavitalli

పవన్ ‘అడవితల్లి బాట’ (Adavi Thalli Bata)తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా అంటే అవుననే చెప్పాలి. దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన..ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న..మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన..ఏజెన్సీ లో మాత్రం గిరిజనుల (Tribal People problems) తిప్పలు తప్పడం లేదు. పాల‌కులు ఎంద‌రూ మారిన గిరిజ‌నుల బ‌తుకులు మాత్రం మార‌డం లేదు. మాట‌లు చెప్పే నాయ‌కులు మాత్ర‌మే ఉన్నారు కాని గిరిజ‌నులు జీవితాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక దృష్టి సారించింది ఎవరు లేరు. స‌రియైన వైద్యం అంద‌క‌, ర‌హ‌దారులు లేక ఇప్ప‌టికి గిరిజ‌న‌లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ప్రాణం మీదకు వస్తే చాలు..డోలి కట్టి మోత మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు కాదు ఎప్పటి నుండే ఇదే నడుస్తుంది. అర్ధరాత్రైనా..అపరాత్రైనా సరే నలుగురు తోడు తీసుకొని అరణ్యాలు దాటాల్సిందే. ఆ అరణ్యాలు దాటేసారి డోలి లో ఉన్న ప్రాణం ఉంటె దేవుడి దయ..లేదంటే కాటికే. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా..ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘అడవి తల్లి బాట’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Tamil Nadu : మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు

ఈ కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను విస్తరించేందుకు దోహదపడనుంది. ఇప్పటివరకు మెయిన్ రోడ్లకు లింక్ రోడ్లు లేకపోవడం వల్ల గిరిజనులు అత్యవసర సేవలకు దూరంగా ఉండిపోయారు. అనారోగ్యం, ప్రసవం వంటి కీలక సమయంలో ఇప్పటికీ డోలీలపై ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఉందన్నది దారుణ వాస్తవం. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పవన్ చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో నవజీవం పోసేలా ఉంది. ‘అడవి తల్లి బాట’కు అంకురార్పణగా పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు గిరిజన గ్రామాలను సందర్శించనున్నారు. మొదట అరకు మండలంలోని పెదపాడు గూడేనికి వెళ్లి అక్కడ గిరిజనుల జీవనశైలిని అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో అధికారికంగా ఈ కార్యక్రమానికి ప్రారంభం పలుకనున్నారు. అదేవిధంగా సుంకరమెట్టలో నిర్మించిన ఉడెన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో తన కాళ్లబాటన తిరుగుతూ ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతారు.

AP Growth Rate: దేశంలో వృద్ధి రేటులో టాప్ లోకి దుసికెళ్ళిన ఏపీ…

పవన్ తీసుకున్న ఈ తొలి అడుగు గిరిజనుల జీవితాల్లో దీర్ఘకాలిక మార్పులకు ఆవిష్కరణగా మారనుంది. నాలుగేళ్లలో లక్షలాది గిరిజనులు మెయిన్ రోడ్లకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా వారికి ముందడుగు పడనుంది. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసం నెలకొనడం, ప్రభుత్వ యంత్రాంగం కూడా చురుగ్గా స్పందించడం చూస్తే గిరిజన గూడేలు అంధకారంలో నుండి వెలుగుబాట పట్టబోతున్నాయని చెప్పడం సందేహం లేదు. పవన్ కల్యాణ్ ఈ పథకంతో నిజమైన అభివృద్ధి వైపు గిరిజన సమాజాన్ని నడిపిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం.