Site icon HashtagU Telugu

Pawan Arrest Notice : BJP డైరెక్ష‌న్లో YCP, జ‌న‌సేన పొలిటిక‌ల్ డ్రామా

Pawan Arrest Notice

Pawan Arrest Notice

ఏపీ రాజ‌కీయాన్ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Pawan Arrest Notice) అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని వ్యూహాత్మ‌కంగా కార్న‌ర్ చేస్తూ జ‌నసేన పార్టీని ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ప‌వ‌న్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌సేనాని ప‌వ‌న్ ను అరెస్ట్ చేయ‌డానికి జీవో నెం.16ను ఏపీ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేయ‌డం ఏపీ రాజ‌కీయాన్ని హీటెక్కించింది. ఈ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు వీలుంటుంది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ ను అరెస్ట్ చేయ‌డానికి జీవో నెం.16ను ఏపీ ప్రభుత్వ విడుదల(Pawan Arrest Notice) 

‘మరొకడేమో యూట్యూబ్ లో డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడు. ఇంకొకడేమో ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దులు పెట్టుకోవాలి.. కడుపు చేయాలి’ అంటాడు. ఒకరు టీవీ షోకి వెళ్లి ‘బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను’ అంటాడు” అంటూ జ‌గ‌న్ విమర్శలు గుప్పించారు. ‘‘ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో సంసారం. ఇచ్చేది బీ ఫామ్.. టీడీపీకి బీ టీం” అంటూ ఘాటుగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  (Pawan Arrest Notice) ఆరోప‌ణ‌లకు దిగారు.

Also Read : TDP Scheme : మ‌గువ‌కు `మ‌హాశ‌క్తి` చంద్ర‌బాబు

చేనేత హ‌స్తం ప‌థ‌కం ప్రారంభోత్స‌వానికి వెంక‌టగిరి వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ పెళ్లిళ్లు, అక్ర‌మ సంబంధాలు, విడాకుల గురించి ప్ర‌సంగించారు. అంతేకాదు, ఈసారి సొంత‌పుత్రుడు అంటూ లోకేష్ ను, బావ‌మ‌రిది అంటూ బాల‌య్య‌ను ఒకేసారి టార్గెట్ చేశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు గురించి నేరుగా మాట్లాడ‌కుండా ద‌త్త‌పుత్రుడు, సొంత పుత్రుడు, బావ‌మ‌రిది అంటూ విడాకులు, అక్ర‌మ సంబంధాలు, ఒక‌ర్ని పెళ్లి చేసుకుని మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధాలు అంటూ విరుచుకుప‌డ్డారు. అమ్మాయి క‌నిపిస్తే ముద్దు పెట్టాలి లేదా క‌డుపు చేయాలంటూ బాల‌య్య అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు.

రెండు వారాలుగా వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టు  ఏపీ రాజ‌కీయం

గ‌త రెండు వారాలుగా వైసీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టు  (Pawan Arrest Notice) ఏపీ రాజ‌కీయం న‌డుస్తోంది. ఆ రెండు పార్టీల గురించి ఏ ఇద్ద‌రు క‌లిసినా మాట్లాడుకుంటున్నారు. వారాహి యాత్ర‌ను ప్రారంభించిన రోజు నుంచి వ్య‌క్తిగ‌తంగా ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేస్తూ ప‌వ‌న్ విరుచుకు ప‌డ్డారు. ప్ర‌తిగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మూకుమ్మ‌డి ప‌వ‌న్ మీద రాజ‌కీయ దాడిని ప్రారంభించారు. అదే స‌మ‌యంలో సీఎం రేప్ లో ఉన్నానంటూ పవ‌న్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలోనూ క‌ల‌క‌లం సృష్టించాయి. సీఎం ప‌ద‌వి ఇస్తే సంతోషంగా తీసుకుంటా అంటూ ఒక‌సారి, అంద‌రూ సీఎం ప‌ద‌వి త‌న‌కు ఇవ్వాల‌ని కోరుకుంటున్నార‌ని మ‌రోసారి మాట్లాడుతూ టీడీపీ వ‌ర్గీయుల‌ను కూడా ఆలోచ‌న‌లో ప‌డేశారు.

Also Read : Jagan BC Card : YCP సంస్థాగ‌త ప్ర‌క్షాళన‌! TTD చైర్మ‌న్ గా `జంగా`?

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ స‌భ‌ల‌కు యువ‌త రావడాన్ని గ‌మ‌నిస్తున్నాం. ఆ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఇటీవ‌ల టార్గెట్ చేశారు. వలంటీర్ల‌ను కించిప‌రుస్తూ మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న మీద రాజ‌కీయ దుమారం బ‌య‌లుదేరింది. బీజేపీ రోడ్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకుంటోన్న ప‌వ‌న్ వ్యూహాత్మంగా రాజ‌కీయాన్ని చుట్టూ తిప్పుకున్నారు. ప‌రోక్షంగా ఆయ‌న్ను హైలెట్ చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీమ్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదంతా అటు వైసీపీ ఇటు జ‌న‌సేన పార్టీల‌ను బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఆడిస్తోన్న గేమ్.(Pawan Arrest Notice) త‌ర‌హాలో క‌నిపిస్తోంది. ఇప్పుడు ప‌వ‌న్ ను అరెస్ట్ చేసే వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ వెళ్లింది.

బీజేపీ రోడ్ మ్యాప్ ప్ర‌కారం న‌డుచుకుంటోన్న ప‌వ‌న్ ,జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

ఒక వేళ ఆయ‌న్ను అరెస్ట్ చేస్తే ఖ‌చ్చితంగా జ‌న‌సేన గ్రాఫ్ పెరుగుతుంది. అదే వైసీపీ, బీజేపీకి కావాలి. అందుకే, సై అంటే సై అంటూ ప‌వ‌న్ దూకుడుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప‌వ‌న్ భేటీ త‌రువాత జ‌రుగుతోన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే ముంద‌స్తు వ్యూహంతో బీజేపీ డైరెక్ష‌న్లో వైసీపీ, జ‌న‌సేన రాజ‌కీయాన్ని పండిస్తున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.