Site icon HashtagU Telugu

Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను..ఈ పిలుపు వినేందుకు సిద్ధం

Pawan Pramanam

Pawan Pramanam

కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ అసెంబ్లీ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు అంటాడా అని గత కొన్నేళ్లుగా అభిమానులు , జనసేన శ్రేణులు ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ మాట వింటామని అంత అనుకున్నారు కానీ కుదరలేదు. కానీ ఈసారి ఆ మాట వినబోతున్నాం అని ధీమా గా ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఎన్నికల సమరం ఏ రేంజ్ లో జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తడం తో అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ గా ఉంది. ఓటర్లు ఎవరికీ మద్దతు తెలిపారో అని ఆలోచిస్తూ..గెలుపు ఫై ఓవరీకి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో బెట్టింగ్ లు కూడా భారీ మొత్తంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం పైనే అందరి చూపు..ఇక్కడ జనసేన నుండి పవన్ కళ్యాణ్ , వైసీపీ నుండి వంగా గీత బరిలో నిల్చున్నారు. ఇక్కడ కూడా భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారో అని కొంతమంది మాట్లాడుకుంటుంటే…చాలామంది మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన శ్రేణులు , కూటమి నేతలు , కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి వారి అంచనాలు నిజం అవుతాయో..లేదో చూడాలి.

Read Also : India vs Pakistan: టీమిండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌కు బెదిరింపు.. భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశాలు ..!