Site icon HashtagU Telugu

AP : లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు – పవన్ కళ్యాణ్

Pawan Paalakonda

Pawan Paalakonda

ఏపీలో ప్రచారం అంత లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నడుస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే తమ భూములు పోతాయా అనే సందేహం ప్రజల్లో ఉంది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన కూటమి.. పదే పదే భూములు పోతాయనీ, భూములపై హక్కులు కోల్పోతారనీ, భూముల అసలైన పత్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని చెబుతుంటే.. ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది..ఏంచేయాలి ఇప్పుడు అంటూ రైతులతో పాటు గుంట భూమి ఉన్న వ్యక్తులు సైతం వైసీపీ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చ లేకుండానే లాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చారని.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి గెలిస్తే మీ సమస్యలన్నీ తీరుతాయని..కూటమి తరఫున బీజేపీ నుంచి కామినేని పోటీ చేస్తున్నారని.. ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని.. కాంటూరు సమస్యపై కామినేని కేంద్రంతో మాట్లాడుతారని పవన్ భరోసా ఇచ్చారు. కైకలూరు ఎమ్మెల్యేది కాదని.. కైకలూరు ప్రజలు ఆయనకు గానీ, ఆయన కొడుకు గానీ భయపడాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ఎన్నికలు ఎంతో కీలకమని.. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూలీలకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు