Site icon HashtagU Telugu

Election Results : కౌంటింగ్ లో తనకు అన్యాయం జరిగిందంటూ పాల్ ఆవేదన

Pul 4votes

Pul 4votes

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తాలూకా ఫలితాలు నిన్న (మంగళవారం ) వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కూటమి సునామి సృష్టించింది. 164 స్థానాల్లో విజయం సాధించి..వైసీపీ కి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. కూటమి విజయంతో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుంటే…వైసీపీ మాత్రం ఓటమి బాధలో ఉంది. ఇదిలా ఉంటె విశాఖ ఎంపీగా బరిలోకి దిగిన కేఏ పాల్ (KA Paul) తనకు అన్యాయం జరిగిందంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగిన అక్కడ ప్రత్యేక్షం అవుతుండడం పాల్ కు అలవాటు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గరి నుండి ఫలితాలు వచ్చేవరకు వార్తల్లో హైలైట్ అవుతుంటారు. గెలుపు సంగతి పక్కన పెడితే ఈయన చేసే హడావిడి..ప్రచారం..చెప్పే హామీలు..ఇచ్చే బిల్డప్ ఇదంతా కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుంది. ఈసారి కూడా అలాగే జరిగింది. ప్రజాశాంతి పార్టీ తరుపున విశాఖపట్నం పార్లమెంట్ నుంచి కేఏ పాల్ బరిలోకి దిగిన ఆయనకు కేవలం 5 ఓట్లు మాత్రమే పడ్డాయి.

మురళీనగర్‌లోని 235 బూత్‌లో తనకు అన్యాయం జరిగిందని పాల్ చెప్పుకొచ్చారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి 5 ఓట్లేనని చెప్పుకొచ్చారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని, అప్పట్లో మోదీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఈసారి సీసీటీవీ లింక్‌లను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులే చెప్పారని, కానీ 8 బూతుల్లో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఇలా ఏకపక్షంగా ఓట్లేసుకుంటే ఎన్నికలు ఎందుకని, రీపోలింగ్ కోసం ఇప్పటికే కోర్టుకెక్కానని, 6న హియరింగ్ ఉందని పాల్ వాపోయారు.

Read Also : Chandrababu : NDA లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు