Site icon HashtagU Telugu

Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు

Chandrababu

CM Jagan Master Plan For Chandrababu Arrest

Chandrababu: గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలా రాసుకొచ్చారు. “45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు…అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే…. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడే..రాజీ పడే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నారు. ఏపీలోని నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో ఏపీలో కలకలం రేపుతోంది.

Also Read: All About FIR : ఎఫ్‌ఐఆర్ లేకుండా అరెస్టు చేయొచ్చా? చంద్రబాబు విషయంలో ఏం జరిగింది?

అవినీతి జరగలేదని రుజువు చేసుకోవాలి: సజ్జల

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి FIR నమోదైనట్లు తెలిపారు. రూ.371 కోట్లలో రూ.240 కోట్లు దారిమళ్లినట్లు 2017, 18లోనే ఆరోపణలు ఉన్నాయన్నారు. స్కామ్ గురించి CID ఎంటర్ కాకముందే జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం చేశాయని చెప్పారు. అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. 2018లోనే విజిల్ బ్లోయర్ ద్వారా ఈ స్కామ్ బయటపడిందని అన్నారు. చంద్రబాబు ఆయన హయాంలోనే నిష్పక్షపాత దర్యాప్తుకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని, అన్ని విషయాలు రిమాండు రిపోర్టులో ఉన్నాయని, ఆ విషయం హైకోర్టకు చెప్పామని సిఐడి అధికారులు అంటున్నారు.