సంక్రాంతి (Sankranti ) పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల రద్దీ (Passengers Traffic) గణనీయంగా పెరుగుతోంది. పండుగకు హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు వంటి పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రాష్ట్రంలోని సొంత గ్రామాలకు తరలి వస్తున్నారు. ఈ కారణంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు వంటి పట్టణాల్లో బస్సు స్టాండ్లు (RTC bus Stands) కిటకిటలాడుతున్నాయి. దీంతో బస్సులు (Buses) ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం ప్రభుత్వ తక్షణ చర్యలపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రద్దీని తగ్గించేందుకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల బస్సులను (Buses of private schools and colleges) ఉపయోగించి ప్రయాణికులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, రవాణాశాఖ అధికారులను ప్రత్యేకంగా ఆదేశించి, ఫిట్‌నెస్ ఉన్న ప్రైవేట్ బస్సులను ఎంపిక చేసి రద్దీ ప్రాంతాలకు పంపాలని తెలిపారు.
Green Co Company : ఏపీలో గ్రీన్కో రూ.35వేల కోట్ల పెట్టుబడులు – పవన్ కళ్యాణ్
దీనిద్వారా ప్రజలకు ప్రయాణ సమస్యల నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్ర రద్దీగా ఉన్న రూట్లను గుర్తించి, ఆ మార్గాల్లో అదనపు బస్సులను నడపాలని సూచించారు. ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిపించడం ద్వారా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పండుగ సమయాల్లో ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపే పండుగ అని, అందరూ సొంత గ్రామాలకు సకాలంలో చేరుకునేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పండుగ సీజన్‌లో రోడ్ల రద్దీ తగ్గించడమే కాకుండా, ప్రజలకు ప్రయాణ సౌలభ్యాలను పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. సంక్రాంతి పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ, ప్రజలందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకునేలా చేయడంలో ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించబోతోందని ఆయన వెల్లడించారు.