APSRTC : నెల్లూరులో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై ప్ర‌యాణికుల దాడి.. కార‌ణం ఇదే..?

నెల్లూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవ‌ర్‌పై ప్ర‌యాణికులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా వాసిలి వద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 08:10 AM IST

నెల్లూరులో ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవ‌ర్‌పై ప్ర‌యాణికులు దాడి చేశారు. నెల్లూరు జిల్లా వాసిలి వద్ద ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌స్సు పూర్తిగా నిండిపోవ‌డంతో బస్సులో ప్రయాణికులను ఎక్కేందుకు డ్రైవర్ ఫిరోజ్ నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు ఫిరోజ్‌ను బలవంతంగా బస్సు నుంచి బయటకు లాగి దాడి చేశారు. కొట్లాట సమయంలో ఓ విద్యార్థిని బస్సు ఎక్కుతుండగా కిందపడిపోయింది. ఇటు డ్రైవర్‌ను రక్షించేందుకు వచ్చిన మెకానిక్‌కు కూడా గాయాలయ్యాయి. ఆత్మకూర్ డిపో మేనేజర్ ఎస్కే ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేశారు. ప్ర‌యాణికులు డ్రైవ‌ర్‌పై దాడి చేయ‌డాన్ని ఆర్టీసీ ఉద్యోగులు ఖండిచారు. గ‌త కొన్ని వారాల క్రితం కావలిలో హారన్ మోగించినందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి జరిగింది. విధులు నిర్వర్తించే సమయంలో బస్సు ఉద్యోగులపై దాడులు జరగకుండా భద్రతా చర్యలు పటిష్టం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Also Read:  Maoists : అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు స‌భ్యులు