Passenger Train : విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

విజయనగరం ( Vizianagaram) జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు (Passenger Train Derailed ) పట్టాలు తప్పింది. విశాఖపట్నం – భవానీపట్నం (Visakhapatnam-Bhawanipatna) ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎంహెచ్ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]

Published By: HashtagU Telugu Desk
Passenger Train Derailed In

Passenger Train Derailed In

విజయనగరం ( Vizianagaram) జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు (Passenger Train Derailed ) పట్టాలు తప్పింది. విశాఖపట్నం – భవానీపట్నం (Visakhapatnam-Bhawanipatna) ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎంహెచ్ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి సాయంత్రం బయల్దేరిన రైలు.. కొత్తవలస స్టేషన్ చేరుకున్న తర్వాత ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నెంబర్ 5 నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు.. రెండో నంబరు లైన్‌కు మారే సమయంలో పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. మెయిన్‌ లైన్ నుంచి మిడిల్‌ లైన్‌కు మారుతున్న క్రమంలో పట్టాలు తప్పి అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రైళ్లోని రెండు బోగీలు పక్కకు ఒరిగాయి. అప్పుడే స్టేషన్ నుంచి బయల్దేరిన నేపథ్యంలో రైలు నెమ్మదిగా వెళ్తోంది. దీంతో పట్టాలు తప్పినప్పటికీ ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి.

గతేడాది కూడా విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది చనిపోయారు. అయితే లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్ సెల్‌ఫోన్లో క్రికెట్ చూడటమే ప్రమాదానికి కారణమని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Read Also : KTR : మార్చి 17లోగా ఎన్నికల హామీలను అమలు చేయాలి

  Last Updated: 10 Mar 2024, 10:21 PM IST