Partial Lockdown: పాక్షిక లాక్ డౌన్ దిశగా ఏపీ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీ నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మార్గదర్శికాల వివరాలు ఇవి.

Published By: HashtagU Telugu Desk
lockdown

lockdown

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలను జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల 8వ తేదీ నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మార్గదర్శికాల వివరాలు ఇవి.

1) సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు బార్‌లు 50% ఆక్యుపెన్సీతో అర్ధరాత్రి 10PM వరకు నడుస్తాయి

2) విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, స్పాలు, జిమ్‌లు, మాల్‌లు, పార్క్‌లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు పూర్తిగా మూసివేసే అవకాశాలున్నాయి.

3)ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు మరియు ఫార్మసీలు తెరవబడతాయి (24/7)

4) సాధారణ దుకాణాలు, మార్ట్ మరియు ఇతర రిటైల్ దుకాణాలు ఉదయం 9:00 గంటలకు తెరుచుకుంటాయి మరియు సాయంత్రం 7:00 గంటలకు మూసివేయబడాలి

5) రాత్రి కర్ఫ్యూ 10PM నుంచి ఉదయం 5AM వరకు ముగిసేలా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టు సమాచారం.

  Last Updated: 08 Jan 2022, 12:00 PM IST