Site icon HashtagU Telugu

Partha Saradhi : పార్టీలో చేరకపోయినా టీడీపీ టికెట్ దక్కించుకున్న పార్థసారథి

Pardasaradi

Pardasaradi

ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈసారి జనసేన – టీడిపి పలు స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. టీడిపి అభ్యర్థుల స్థానంలో జనసేన , జనసేన పోటీ చేయాల్సిన స్థానాల్లో టిడిపి పోటీకి దిగవల్సి వచ్చింది. దీంతో చాల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు తమ టికెట్ల ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే టీడిపి లో ఇంకా అధికారికంగా చేరకపోయిన టికెట్ దక్కించుకున్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.

కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గత కొద్దీ రోజులుగా టీడీపీ వైపు చూస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనిపై చర్చలు కూడా చంద్రబాబు తో జరిపారు. కానీ ఇంకా అధికారికంగా కండువా కప్పుకోలేదు. అయినప్పటికీ ఈరోజు టిడిపి ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో పార్థసారథి పేరు కూడా వచ్చింది. నూజివీడు నుంచి కొలుసు పోటీ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ని ఖరారు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ టికెట్ దక్కకపోవడంతో కుప్పకూలిపోయాడు. లిస్ట్ లో తన పేరు వస్తుందని వేదవ్యాస్ భావించాడు కానీ కాగిత కృష్ణ ప్రసాద్ కు అధిష్టానం టికెట్ ఇవ్వడం తో తట్టుకోలేకపోయాడు. మరి టికెట్ రాలేదని పార్టీ కి ఏమైనా రాజీనామా చేస్తారా..లేక పార్టీ విజయానికి సపోర్ట్ చేస్తారా అనేది చూడాలి.

మరోపక్క జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ సూర్యచంద్ర..టికెట్ రాలేదని కంటతడి పెట్టుకున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట టికెట్ జ్యోతుల వెంకటప్ప రావు (నెహ్రూ) కు కేటాయించడంతో సూర్యచంద్ర కన్నీరు పెట్టుకున్నారు.

Read Also : New Criminal Laws : కొత్త క్రిమినల్ చ‌ట్టాల అమలుకు డేట్ ఫిక్స్