టీడీపీ జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. మరోవైపు టికెట్ ఆశించే నేతల్లో మాత్రం ఏఏ నియోజకవర్గాలు పొత్తులో జనసేనకు వెళ్లాయో అనే ఆందోళన నెలకొంది. తమకు టికెట్ వస్తుందా రాదా అనే టెన్షన్‌లో టికెట్ ఆశిస్తున్న నేతలు ఉన్నారు. అయితే జనసేన – టీడీపీ పార్టీలు ఇప్పటికే టికెట్‌ల విషయంలో ఓ క్లారిటీకి వచ్చాయి. ఏఏ జిల్లాల్లో ఎక్కడ జనసేనకు టికెట్లు ఇవ్వాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి తో పాటు మిగిలిన జిల్లాలో ఒకటి రెండు సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇటు ప్రధానంగా కృష్ణాజిల్లాలో టీడీపీ నేతల మధ్య వివాదాలు పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయి. విజయవాడ పార్లమెంట్‌లో వర్గాలుగా విడిపోయి క్యాడర్‌ని నేతలు అయోమయానికి గురు చేస్తున్నారు. అయితే జనసేన టీడీపీ పొత్తుతో ఓట్లు చీలకుండా ఉండటంతో టీడీపీ ఇక్కడ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది. ఇక్కడ జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పోతిన మహేష్‌కి జనంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పోతిన మహేష్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఇటు టీడీపీ నుంచి కూడా ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. ఎంపీ కేశినేని నానితో మహేష్‌కి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ టీడీపీ క్యాడర్ ఆయనకు పూర్తిగా సహకరించే అవకాశం ఉంది.
ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. జగన్ తొలి కేబినెట్‌లో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో దుర్గ గుడిలో అనేక వివాదాలకు ఆయన కేంద్ర బిందువు అయ్యారు. ముఖ్యంగా అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాల చోరీ ఘటన ఆయన హాయంలో జరిగింది. దీనిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికి ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టింది.