AP Politics: పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అదే స్థానం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్నాడు. ఇటీవల ధర్మవరం మండలం రావులచెరువు గ్రామంలో పర్యటించిన శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయాలనే ధీమాను వ్యక్తం చేశారు.
ఇటీవల రావులచెరువు గ్రామంలో విస్తృతంగా పర్యటించిన శ్రీరామ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్, డబుల్ రోడ్డుతో పాటు పలు సమస్యలను గ్రామస్తులు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని శ్రీరామ్ హామీ ఇవ్వడంతో పాటు పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తనను అభ్యర్థిగా, నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యునిగా చూడాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే గ్రామస్తులు ఎలాంటి అభ్యర్థనలు వచ్చినా స్వేచ్ఛగా నా వద్దకు రావాలని కోరారు. ధర్మవరంలో గందరగోళానికి తావులేదని, ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని శ్రీరాములు తేల్చిచెప్పారు. అయితే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా టికెట్ల అంశంపై క్లారిటీ లేదు. పరిటాల సునీతకు టికెట్ ఇస్తారా, శ్రీరామ్ ని బరిలోకి దించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి ధర్మవరంలో తానే అభ్యర్దినంటూ ప్రచారం చేస్తుండటంపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Hyundai Venue Executive: హ్యుందాయ్ నుంచి మరో కొత్త కారు.. ధర ఎంతంటే..?