అనకాపల్లి ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్(Parawada Pharma City) ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరొకరు మరణించారు. ఇప్పటివరకు ముగ్గురు ఇద్దరు కోల్పోగా..శ్రీకాకుళం కు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ నెల 23న లాల్సింగ్ పూరి, 24న ఝార్ఖండ్ వాసి రొయా అంగిరాయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో గాయపడ్డ ఝార్ఖండ్ కు చెందిన ఓయబోం కొర్హ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి 6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాన్‌హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. పరిశ్రమ యజమానులు భద్రతా ప్రోటోకాల్‌లను విస్మరించడం వల్ల ఇటువంటి పారిశ్రామిక ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయని హోమ్ మంత్రి సీరియస్ అయ్యారు. ఆయా సంస్థలు భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మంత్రి అనిత పారిశ్రామిక భద్రతపై దృష్టి సారించే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక పద్ధతులను సమగ్రంగా పర్యవేక్షించేలా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Also : Students Clashes : అన్సార్ ఫోర్స్ వర్సెస్ విద్యార్థి సంఘాలు.. మళ్లీ అట్టుడికిన ఢాకా