Tirumala : పోలీసు స్టేషన్ లో యువకుడి ఆత్మహత్యా యత్నం.. వివాహిత కిడ్నాప్ కలకలం

విజయవాడలోని ఇబ్రహీంపట్నం కు చెందిన బి.శంకర్ అదే ప్రాంతంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తున్న ఒక వివాహితతో రెండేళ్లుగా స్నేహం పెంచుకున్నాడు. ఆమెను తన మాయమాటలతో నమ్మించాడు

Published By: HashtagU Telugu Desk
Tirumala Police Station

Tirumala Police Station

విజయవాడలోని ఇబ్రహీంపట్నం కు చెందిన బి.శంకర్ అదే ప్రాంతంలో మిఠాయి దుకాణం నిర్వహిస్తున్న ఒక వివాహితతో రెండేళ్లుగా స్నేహం పెంచుకున్నాడు. ఆమెను తన మాయమాటలతో నమ్మించాడు. ఆమెతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు వచ్చి.. ‘ ఎస్ఎంసీ -275సీ’ లో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. గదిలో దిగిన తర్వాత .. శంకర్ అనుచిత ప్రవర్తనతో ఆమె భయాందోళనకు గురైంది. వెంటనే తన భర్తకు, డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. బుధవారం ఉదయం తిరుమలకు చేరుకున్న వివాహిత భర్త, కుటుంబ సభ్యులు ఆ యువకుడిని చితకబాదారు. ఇంతలో తిరుమల టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని రక్షించి, ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈక్రమంలో పోలీసు స్టేషన్ రెండో అంతస్తుపైకి వస్తున్న సమయంలో శంకర్ అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో అతడి కుడి కాలికి తీవ్రగాయాలు కాగా, కంటికి స్వల్ప గాయమైంది. కాగా , వివాహిత గతంలో తనతో నాలుగుసార్లు బయటకు వచ్చిందని నిందితుడు బి.శంకర్ పోలీసులకు చెప్పాడు. వివాహితను కుటుంబీకులు తీసుకెళ్తారని, పోలీసులు తనను జైలులో వేస్తారనే భయంతో బిల్డింగ్ పైనుంచి దూకినట్లు తెలిపాడు. కిడ్నాపింగ్, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడనే అభియోగాలతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.వివాహితకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  Last Updated: 28 Apr 2022, 02:24 PM IST