Success story : పేప‌ర్ బాయ్ నుంచి ఐఏఎస్‌ దాకా..!

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీశా శ‌నివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు.

  • Written By:
  • Updated On - November 2, 2021 / 03:53 PM IST

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ల‌క్ష్మీశా శ‌నివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ అధికారి లక్ష్మీశ ఓ నిరుపేద‌ రైతు కుటుంబంలో జ‌న్మించారు. ఇంటర్మీడియట్ చదువుతూనే న్యూస్‌పేపర్‌ బాయ్‌గా కూడా ప‌ని చేశారు.కర్నాటక రాష్ట్రంలోని హోలుగుండనహళ్లి అనే మారుమూల గ్రామానికి చెందిన తన తల్లి లక్ష్మమ్మ కూడా ఇంటి పనుల్లో కూరుకుపోయి కుటుంబ పోషణ కోసం తన తండ్రి గంగముత్తయ్యతో కలిసి వ్యవసాయ కూలీగా పొలాలకు వెళ్లేవార‌ని ఆయ‌న చెప్తుంటారు.

తీవ్రమైన పేదరికం కష్టపడి చదివి జీవితంలో పైకి రావాలనే అతని సంకల్పాన్ని బలపరిచింది. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నెలకు రూ.300 సంపాదించేందుకు తెల్లవారుజామున న్యూస్ పేపర్ బాయ్ గా పనిచేశారు. తల్లికి రూ.100 ఇచ్చి పాకెట్ మనీగా రూ.200 ఉంచుకునేవారు.ఇంట‌ర్ త‌రువాత బీఎస్సీలో చేరారు. అగ్రికల్చర్ కోర్సు చదివితే మంచి బ్యాంక్ ఉద్యోగం వస్తుందనే భావ‌న‌లో ఉండేవారు..అయితే బీఎస్సీ తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది ఎమ్మెస్సీ చదివేందుకు అల‌హాబాద్‌ వెళ్లారు. అక్కడ నుండి సీనియర్ ఫెలోషిప్ పొంది, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లో చేరారు. అగ్రి సైంటిస్ట్‌గా మారిన తర్వాత Ph.D. కోసం ఢిల్లీ వెళ్లారు.ల‌క్ష్మీశా సైకాలజీ కూడా చదివారు శాస్త్రవేత్తగా పని చేస్తున్న సమయంలోనే అతని స్నేహితుల ప్రోత్సాహంతో లక్ష్మీషాకు సివిల్ సర్వీసెస్‌కు హాజరు కావాలనే ఆలోచన వచ్చింది. తన అన్నయ్య వెంకటరమణయ్యను సంప్రదించి సివిల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2009లో సివిల్స్ ప‌రీక్ష‌కు హాజరై.. రాకపోవడంతో 2010లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యేందుకు మరో ప్రయత్నం చేశాడు.

అయితే ఐఎఫ్ఎస్‌లో హిమాచ‌ల్ కేడ‌ర్ పోస్టింగ్ వ‌చ్చింది.ఆ త‌రువాత 2013లో నాల్గొవ‌సారి మ‌రో ప్ర‌య‌త్నం చేశారు.ఈ సారి సివిల్స్ 275 ర్యాంక్ సాధించి ఏపీ క్యాడ‌ర్‌కు ఎంపికైయ్యారు. క‌ర్నూల్‌లో ట్రైనీ ఐఏఎస్‌గా శిక్ష‌ణ పొందిన త‌రువాత కృష్ణాజిల్లా నూజివీడు స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా మొద‌టి పోస్టింగ్ వ‌చ్చింది.ఆ త‌రువాత పార్వ‌తీపురం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీస‌ర్‌గా ప‌ని చేస్తూ బ‌దిలీపై తూర్పుగోదావ‌రి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా వెళ్లారు.తాజ‌గా గ్రేట‌ర్ విశాఖ‌ప‌ట్నం మున్పిప‌ల్ కార్పోరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.