Panchayat Secretary : వామ్మో..పంచాయతీ కార్యదర్శి ఆస్తి రూ.85 కోట్లు!

Panchayat Secretary : తాజాగా తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న అతని నివాసంలో అధికారులు తడిసి మోపెడు ఆధారాలు సేకరించారు. ఈ సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు అధికారులకే షాక్ ఇచ్చాయి

Published By: HashtagU Telugu Desk
Panchayat Secretary Accumul

Panchayat Secretary Accumul

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి(Chandragiri Panchayat Secretary)గా పని చేస్తున్న మహేశ్వరయ్య (Maheswaraiah)అక్రమ ఆస్తుల (Illegal Assets)పై వచ్చిన సమాచారం ఆధారంగా, ఏసీబీ (ACB) అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే గత ఫిబ్రవరిలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన మహేశ్వరయ్యపై ఇప్పటికే అనుమానాలు ఉన్న నేపథ్యంలో, తాజాగా తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న అతని నివాసంలో అధికారులు తడిసి మోపెడు ఆధారాలు సేకరించారు. ఈ సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు అధికారులకే షాక్ ఇచ్చాయి.

Gold Loan Rules: ఇక‌పై బంగారంపై రుణం సులభంగా లభించదా?

సోదాల్లో భాగంగా మహేశ్వరయ్యకు బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్, పలమనేరులో మూడు అంతస్తుల భారీ నివాసం, ఫామ్ హౌస్, బద్వేలు వద్ద విస్తారమైన భూములు అలాగే పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్లు తేలింది. వీటి విలువ సుమారుగా రూ.85 కోట్లకు పైగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఒక పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి దగ్గర ఈ స్థాయిలో ఆస్తులు ఉండడం ఏసీబీ అధికారులను షాక్ కు గురి చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఆస్తుల వెనుక ఉన్న ఆదాయానికి సంబంధం లేని సంపాదనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మహేశ్వరయ్యకు ఉన్న సంబంధాలు, బ్యాంక్ లావాదేవీలు, ఇతర ప్రాపర్టీ డీల్స్‌ను అధికారులు గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ స్థాయిలో అక్రమ సంపదను కూడబెట్టిన మహేశ్వరయ్యపై పలు అభియోగాలు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  Last Updated: 09 Apr 2025, 04:05 PM IST