Site icon HashtagU Telugu

Palnadu Fighting : పేషెంట్లతో కిటకిటలాడుతున్న సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్

Stnp

Stnp

నిన్న ఆంధ్రప్రదేశ్‌ (AP)లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేసి నానా బీబత్సం సృష్టించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో బాంబుల మోత మోగాయి. టీడీపీ (TDP) శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు.

మల్లమ్మ సెంటర్‌ (Mallamma Center)లో టీడీపీ (TDP) నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు (Chadalavada Aravinda Babu) ,అటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Gopireddy Srinivasa Reddy) వర్గీయులు ఒకరిపై ఒకరు కర్రలతో , రాళ్లతో దాడి చేసుకోవడంతో పదుల సంఖ్యలో వారందరికీ గాయాలు అయ్యాయి. దీంతో వారంతా ప్రస్తుతం సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నిన్న రాజుపాలెం మండలం గణపవరంలో వైసీపీ నేత మర్రి సుబ్బారెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గౌతమ్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో పరిస్థితి అదుపుతప్పడంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కారంపూడి మండలం ఒప్పిచర్లలో వైసీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి జరిగింది. హిందూపురంలో పరస్పర దాడులకు దిగారు. ఇలా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు జరిగినప్పటికీ..ఓటర్లు మాత్రం ఏమాత్రం భయపడకుండా ఓట్లు వేశారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 84 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది.

Read Also : T20 World Cup: మెగా టోర్నీకి ఏయే దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయో తెలుసా..?