Site icon HashtagU Telugu

Palnadu Fight: పల్నాడు TDPలో `క‌న్నా`అల‌జ‌డి! స‌త్తెన‌ప‌ల్లిపై`కోడెల‌`మార్క్‌!!

Palnadu Fight

Palnadu Fight

ఏపీ తొలి స్పీక‌ర్, మాజీ మంత్రి కోడెల శివ‌ప్ర‌సాద్ కుటుంబం ప్ర‌భావం పల్నాడు టీడీపీ (Palnadu Fight) మీద ప‌డుతోంది. ఆ కుటుంబానికి అన్యాయం జ‌రుగుతుంద‌ని కోడెల ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. పార్టీ అధిష్టానం స‌త్తెన‌ప‌ల్లి అభ్యర్థిగా క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌ను ప్ర‌క‌టించిన త‌రువాత కోడెల కుమారుడు శివ‌రాం మీడియా ముందుకొచ్చారు. మూడేళ్లుగా అపాయిట్మెంట్ అడుగుతున్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని బాంబ్ పేల్చారు. దీంతో టీడీపీ ప‌ల్నాడు వ‌ర్గాల్లో గ్రూప్ విభేదాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

పల్నాడు టీడీపీ మీద కోడెల శివ‌ప్ర‌సాద్ ప్ర‌భావం (Palnadu Fight) 

తొలి నుంచి కోడెల శివ‌ప్ర‌సాద్ కు సామాన్యుడి డాక్ట‌ర్ గా ప‌ల్నాడు ప్రాంతంలో గుర్తింపు ఉంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యాంలో రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ప‌ల్నాడు రాజ‌కీయాన్ని ఒంటిచేత్తో (Palnadu Fight)న‌డిపారు. తిరుగులేని లీడ‌ర్ గా గుంటూరు జిల్లాలో ఎదిగారు. ఆయ‌న హ‌యాంలో గుంటూరు జిల్లా టీడీపీ బ‌లంగా ఉండేది. అప్ప‌ట్లో కోడెల శివ‌ప్ర‌సాద్, జేఆర్ పుష్ప‌రాజ్ మంత్రులుగా ఉండేవాళ్లు. తిరుగులేని పార్టీగా టీడీపీ హ‌వా కొన‌సాగింది. ఆ త‌రువాత గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడుగా ప్ర‌త్తిపాటి పుల్లారావుకు(prathipati pullarao) అప్ప‌గించ‌డం, కోడెలను బాంబుల కేసు వెంటాడ‌డం…త‌దిత‌రాల‌న్నీ గుంటూరు టీడీపీ చ‌రిత్ర‌ను మార్చేశాయి. క్ర‌మంగా జేఆర్ పుష్ప‌రాజ్‌, కోడెల హ‌వాను త‌గ్గిస్తూ ప్ర‌త్యామ్నాయంగా ఆలపాటి రాజేంద్రనాథ్‌ అలియాస్ రాజా, పుల్లారావు ను టీడీపీ అధిష్టానం పెంచింది. ఫలితంగా టీడీపీ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌చ్చింది.

ప‌ల్నాడు పులిగా కోడెల శివ‌ప్ర‌సాద్ 

ప‌ల్నాడు పులిగా పేరుగాంచిన కోడెల శివ‌ప్ర‌సాద్(Kodela Sivaprasad) రాజ‌కీయ కోర‌ల‌ను పీకుతూ పార్టీ అధిష్టానం వ్య‌వ‌హ‌రించింద‌ని ఆయ‌న ఫ్యాన్స్ చెబుతుంటారు. విధిలేని ప‌రిస్థితుల్లో 2014 ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట‌ను కాద‌ని సత్తెన‌ప‌ల్లి నుంచి కోడెల‌కు టిక్కెట్ ఇచ్చారు. అక్క‌డ నుంచి ఆయ‌న గెలుపొందారు. స్పీక‌ర్ గా ఐదేళ్ల పాటు కొన‌సాగారు. మంత్రి కావాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ స్పీక‌ర్ కు ఆయ‌న్ను ప‌రిమితం చేశారు. మంత్రి ప‌ద‌వుల‌ను పుల్లారావు, న‌క్కా ఆనంద‌బాబుల‌కు ఇచ్చారు. కానీ, వాళ్లు పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి బ‌దులుగా సొంత వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇచ్చార‌ని సొంత క్యాడ‌ర్ నుంచి విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. సీన్ క‌ట్ చేస్తే, 2019 ఎన్నిక‌ల్లో సత్తెన‌ప‌ల్లి నుంచి కోడెల(Kodela) ఓడిపోయారు. ఆ త‌రువాత కుటుంబంలోని అంత‌ర్గ‌త సమ‌స్య‌ల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

స‌త్తెన‌ప‌ల్లి లోని కోడెల అనుచ‌రులను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెట్టిన వేధింపులు త‌ట్టుకోలేక కోడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని అప్ప‌ట్లో టీడీపీ ఆరోపించింది. ఆయ‌న పాడెను చంద్ర‌బాబు మోసారు. ఆ సంద‌ర్భంగా కోడెల లేని లోటును తీర్చుతానంటూ శివ‌రామ్ ను ప్రోత్స‌హించేలా హామీ ఇచ్చారు. ముఠాక‌క్ష్యంలు, ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న ప‌ల్నాడులో కోడెల అనుచ‌రుల‌పై వైసీపీ ప‌లు విధాలుగా దాడులు చేసింది. న‌ర్స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలోని కోడెల అనుచ‌రుల‌ను ఏరిపారేశారు. ఆ త‌రువాత స‌త్తెన‌ప‌ల్లి లోని కోడెల అనుచ‌రులను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. అయిన‌ప్ప‌టికీ కోడెల శివ‌ప్ర‌సాద్ మీద ఉన్న అభిమానంతో క్యాడ‌ర్ పార్టీలో కొన‌సాగుతోంది. ఇప్పుడు కోడెల కుటుంబాన్ని కాద‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయణ‌కు టిక్కెట్ ఇస్తూ అధిష్టానం ప్ర‌క‌టించ‌డంతో క్యాడ‌ర్(Palnadu Fight) భ‌గ్గుమంటోంది.

Also Read : TDP Manifesto Copy: చంద్రబాబు మేనిఫెస్టో ఒక కాపీక్యాట్: సీఎం జగన్

డాక్ట‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రాజ‌కీయ వార‌సునిగా శివరామ్ (Kodela Sivaram)ఉన్నారు. యువ‌నాయ‌కునిగా టీడీపీ త‌ర‌పున ప‌నిచేస్తున్నారు. కానీ, చంద్ర‌బాబును తొలి నుంచి వ్య‌తిరేకిస్తోన్న క‌న్నా ల‌క్ష్మీనార‌య‌ణ‌కు(Kanna Lakshminarayana) స‌త్తెప‌ల్లి టిక్కెట్ ఇవ్వ‌డం క్యాడ‌ర్ ను ఆగ్ర‌హం క‌లిగించేలా చేసింది. వాళ్ల‌ను శాంత‌ప‌రిచేందుకు టీడీపీ అధిష్టానం కొంద‌రు దూత‌ల‌ను పంపింది. వాళ్ల‌ను అడ్డుకుంటూ కోడెల కుటుంబాన్ని కాద‌ని ఎలా క‌న్నాకు టిక్కెట్ ఇస్తార‌ని నిల‌దీశారు. దీంతో అధిష్టానంకు ఇప్పుడు త‌ల‌నొప్పిగా మారింది. పైగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప‌ల్నాడులో ఎంట్రీ ఇవ్వ‌డం స్థానికుల‌కు ఇష్టంలేదు. ఆయ‌న పెద‌కూర‌పాడు నుంచి రాజ‌కీయంగా ఎదిగారు. ఇప్పుడు ప‌ల్నాడులోకి ప్ర‌వేశించ‌డం వైసీపీకి క‌లిసొస్తుంద‌ని టీడీపీ క్యాడ‌ర్ ఆందోళ‌న‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎలా స‌యోధ్య చేస్తుంది? అనేది ఆస‌క్తిక‌రం.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు