TDP State President: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామకం

  • Written By:
  • Updated On - June 16, 2024 / 11:36 PM IST

TDP State President: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని (TDP State President) మారుస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్రీ పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను అని వెల్లడించారు.

రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

Also Read: IND-W vs SA-W First ODI: దక్షిణాఫ్రికాపై సెంచరీతో కదం తొక్కిన స్మృతి మంధాన

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో టీడీపీ కూటమిలో మంత్రిగా స్థానం దక్కింది. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం అచ్చెన్నాయుడిపై పని భారం తగ్గించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పల్లా శ్రీనివాసరావుకు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి అటు మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యత వహించడం కష్టమని భావించిన సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp : Click to Join