Site icon HashtagU Telugu

TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ

Pakala Zptc Who Joined Tdp

Pakala ZPTC who joined TDP

Chandragiri ycp: ఏపి(AP)లో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్(jagan) వెంట నడిచిన కీలక నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ అధినేత తీరుతో పాటు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ(tdp)లో చేరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా పాకాల జడ్పీటీసీ(Pakala ZPTC) సభ్యురాలు నంగా పద్మజారెడ్డి(Nanga Padmaja Reddy), ప్రముఖ పారిశ్రామికవేత్త రమణమూర్తి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ముడిపల్లి సురేష్‌రెడ్డి తదితరులు టీడీపీ కండువా కప్పుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పాకాల జడ్పీటీసీ పద్మజారెడ్డితోపాటు ఆమె భర్త వైసీపీ సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబురెడ్డి కూడా పార్టీ మారారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు దక్కడంలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల కుటుంబ పాలన ఎక్కువైందని, ఎమ్మెల్యే పీఏ, పీఆర్వోల పెత్తనం పెరిగిపోయిందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉత్సవ విగ్రహాలుగా మారిపోవాల్సి వస్తోందని పద్మజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రొటోకాల్ మర్యాదలకూ తాము నోచుకోలేదని, ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేసేందుకు వీలు కలగలేదని పద్మజారెడ్డి వాపోయారు.

Read Also:  Lakshadweep : లక్షద్వీప్‌ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి..అధికారుల వెల్లడి

మరోవైపు ఏపిలో వైసీపీ నేతలు అహంకారంతో విర్రవీగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మైనారిటీ మహిళ బురఖాను తొలగించి అవమానించిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. నందికొట్కూరులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ బురఖా తొలగించడాన్ని ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేశారని, రాష్ట్రంలో వైసీపీ నేతలు కౌరవులుగా మారిపోయారని అన్నారు. ఈ ఘటన వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని చెప్పారు. మత ఆచారాలను గౌరవించని, మహిళల మనోభావాలకు విలువివ్వని ఈ కౌరవ మూకను తరిమి కొడదామని, మే 13న అన్ని వర్గాలు ఏకమై ప్రజాగ్రహం అంటే ఏంటో వైసీపీ నేతలకు చూపించాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.