Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్

రిపబ్లిక్‌ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్‌ జననాయక్‌, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌‌కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్‌ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు), కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్), పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) ఉన్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Padma Vibhushan

Padma Vibhushan

రిపబ్లిక్‌ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్‌ జననాయక్‌, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌‌కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్‌ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు), కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్), పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) ఉన్నారు.

ప్రజా సంబంధాల విభాగంలో పద్మ విభూషణ్‌ అందుకున్న వారిలో ఎం. వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్), సామాజిక సేవ విభాగంలో బిందేశ్వర్ పాఠక్ (మరణాంనతరం) (బిహార్) ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు (Telugu States) చెందిన ముగ్గురికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కడం విశేషం. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి (Uma Maheswari)కి, తెలంగాణ కు చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప (Dasari Kondappa), నారాయణపేట జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య (Gaddam Sammaiah)కు పద్మ శ్రీ అవార్డ్స్ (Padma Sri) దక్కాయి.

We’re now on WhatsApp. Click to Join.

పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో అందజేస్తారు. కళలు, సమాజ సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందిస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2023లో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మ భూషణ్, 91 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. గత ఏడాది తెలంగాణ నుంచి చిన జీయర్ స్వామి, కమలేష్ డి పాటిల్‌ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.

Read Also : Ilayaraja’s Daughter Bhavatharini : ఇళయరాజా ఇంట విషాద ఛాయలు ..

  Last Updated: 25 Jan 2024, 11:56 PM IST