అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు(Paderu)లో ర్యాగింగ్ కలకలం (Ragging Case) సృష్టించింది. సాధారణంగా పట్టణాలకే పరిమితమైన ర్యాగింగ్ అనే భూతం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలను కూడా ప్రభావితం చేయడం ఆందోళన కలిగిస్తుంది. పాడేరు సెయింటాన్స్ పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడి హాస్టల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థినులు ఉంటారు. హాస్టల్‌లోని వార్డెన్‌కు ఫిర్యాదు చేసిందన్న కోపంతో పదో తరగతి విద్యార్థినులు ఏడో తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.
MPTB ద్వారా ఈ-కామర్స్ వ్యాపారంలో చేరనున్న మధ్యప్రదేశ్ కళాకారులు
డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో పాఠశాలను పరిశీలించి ర్యాగింగ్ ఘటనపై పూర్తిగా సమాచారం సేకరించారు. హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవడంతో, హాస్టల్ నిర్వాహకురాలిని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ షినా నిర్ణయం తీసుకున్నారు. అలాగే దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు పంపిస్తూ, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు.