ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రతిపాదించిన P4 కాన్సెప్ట్ (పీపుల్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) ఒక వినూత్నమైన ఆలోచన. ఇది ప్రభుత్వం నేరుగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం లేకుండా, ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతగా పేద కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా “మార్గదర్శి – బంగారు కుటుంబం” అనే కాన్సెప్ట్‌ను ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మార్గాలను సూచిస్తారు. విద్య, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి ద్వారా సామాజిక స్థితిని మెరుగుపరిచేందుకు ఈ పథకం ఉపయోగకరంగా మారనుంది.
Virat Kohli Perfume: విరాట్ కోహ్లీ పర్మిషన్ లేకుండా పెర్ఫ్యూమ్ యూజ్ చేసిన ఆర్సీబీ ఆటగాడు..!
ఈ పథకం అమలు అయినా అది ప్రజలలో ఎంతమంది అర్థం చేసుకుని స్వీకరిస్తారన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పటివరకు పేదరిక నివారణకు అనేక పథకాలు వచ్చాయి కానీ కొంత మంది ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడిపోయారు. రేషన్, పింఛన్, ఉచిత సేవల కారణంగా కొందరు స్వయంగా ఎదగడానికి ప్రయత్నం చేయడం మర్చిపోతున్నారు. అందుకే P4 స్కీమ్ ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందా? అన్న ప్రశ్న లేఖిస్తోంది. పైగా ఈ పథకంలో భాగంగా సహాయం అందించే వారు నిజమైన మార్గదర్శకులుగా మారాలే గానీ, కేవలం ఆర్థిక సాయం చేయడమే పరిమితమైతే దీని ఉద్దేశ్యం నెరవేరదని విశ్లేషకులు చెబుతున్నారు.
YS Jagan Tweet: పవన్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం.. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది?
చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఈ P4 కాన్సెప్ట్ సిద్ధాంతం ప్రకారం.. పేదరికాన్ని నిర్మూలించడానికి కేవలం ఉచిత సాయంపై ఆధారపడకుండా, ప్రజల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలి. అయితే ఇది విజయవంతం కావాలంటే, ముందుగా ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. పేదలు తమను ఆదుకుంటున్న వారు జీవితాంతం పోషిస్తారనే భావనకు లోనవకుండా, అందించిన అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు సాగాలి. లేకపోతే ఈ ఉన్నతమైన ఆలోచన కూడా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది. కనుక పేదరిక నిర్మూలనకు కేవలం ఆర్థిక సాయం కాకుండా, స్వయం సమృద్ధిని పెంచే మార్గాల్లో ప్రభుత్వ హస్తక్షేపం అవసరం.