Site icon HashtagU Telugu

AP Tours : చంద్ర‌బాబు, షా, ప‌వ‌న్ పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జీవో! ఆపే ద‌మ్ముందా?

CBN Turning Point

Cbn, Pawan, Shah

రాజ్యాంగం అంద‌ర‌కీ ఒక‌టే. ప్ర‌జాస్వామ్యాన్ని అంద‌రూ  ఆస్వాదించాలి. అప్పుడు సుప‌రిపాల‌న ఉన్న‌ట్టు. మ‌నిషికో రూలు, లీడ‌ర్ కో జీవో, హోదా కో నిబంధ‌న ఉంటే ప్ర‌జాస్వామ్యం అనిపించుకోదు. ఆ విష‌యాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించాలి. రాజ‌మండ్రి బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కొత్త జీవో (New G.O.)ప‌నిచేయ‌లేదు. కుప్పం స‌భ‌కు చంద్ర‌బాబును వెళ్ల‌కుండా అదే జీవో అడ్డుకుంది. జ‌న‌వ‌రి ఎనిమిదో తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ ప‌ర్య‌ట‌న ఖరారు చేసుకుని వాయిదా వేసుకున్నారు. కానీ, ఆయ‌న వ‌స్తే ఇదే జీవోను జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేసే ధైర్యం చేస్తుందా? అంటే వ‌చ్చే స‌మాధానం అంద‌రికీ తెలిసిందే. ఇక జ‌న‌వ‌రి 12న శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం వ‌ద్ద యువ‌శ‌క్తి స‌భ‌కు జ‌నసేనాని ప‌వ‌న్ పిలుపు నిచ్చారు. దాన్ని అడ్డుకునే ద‌మ్ము జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు ఉందా? అంటే లేద‌ని చెప్పాలి. రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌పై (Ap Tours)ఆంక్ష‌లు పెడుతూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో విప‌క్షాలను మాత్ర‌మే కాదు ప్ర‌జ‌ల్ని కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది.

రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌ల‌పై (Ap Tours)ఆంక్ష‌లు

చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఆ నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పోలీసులు మోహరించారు. టీడీపీ ప్రచార రథాన్ని, మరో వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. ఆ రెండు వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. సౌండ్ సిస్టం ఉపయోగించేందుకు అనుమతి కోరుతూ పోలీస్ అధికారులకు టీడీపీ నేతలు రాసిన లేఖ‌కు తిరుగు స‌మాధానం లేదు. కుప్పం పర్యటనలో భాగంగా కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఆ. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ లో ఉన్న గ్రామాల్లో భారీగా పోలీసుల‌ను మోహరించారు. గ్రామ కూడళ్ల‌లో పోలీసు వాహనాలను నిఘా పెట్టారు. చంద్రబాబు పెద్దూరు గ్రామానికి చేరుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఆయ‌న్ను మ‌ధ్య‌లోనే అదుపులోకి తీసుకోవ‌డానికి పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.

అమిత్ షా జనవరి 8న ప‌ర్య‌ట‌న వాయిదా

అమిత్ షా జనవరి 8న ప‌ర్య‌ట‌న ఆపండ‌ని బీజేపీ సవాల్ చేస్తోంది. ఆ రోజు కర్నూలుకు చేరుకోనున్న అమిత్ షా, అనంతరం పుట్టపర్తిలోనూ పర్యటిస్తారు. ఉదయం 11.15కు కర్నూల్లో అమిత్ షా బహిరంగసభ ఉండ‌నుంది. ఆ సభ‌లో ఏపీకి సంబంధించి అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. ఆ సభ ముగియగానే మధ్యాహ్న భోజనం ముగించుకుని శ్రీ సత్యసాయి జిల్లాలోకి అమిత్ షా అడుగు పెడతారు. మధ్యాహ్నం 1:30 గంటలకి పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకి పుట్టపర్తిలో బీజేపీ నేతలతో అమిత్ షా బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 4:30కి పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని అమిత్ షా సందర్శించనున్నారు. పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ అవుతారు. దీంతో అమిత్ షా టూర్ ముగియనుంద‌ని బీజేపీ షెడ్యూల్ ఖరారు చేసింది. కానీ, ఆయ‌న ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ విడుద‌ల చేసిన తాజా జీవో(New G.O.) ప‌నిచేస్తుందా? అంటే ఆ ద‌మ్ము సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లేద‌ని ఎవ‌రైనా చెబుతారు. అయితే, చివ‌రి నిమిషంలో అమిత్ షా ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది.

జ‌న‌వ‌రి 12న శ్రీకాకుళం జిల్లా ర‌ణ‌స్థ‌లం వ‌ద్ద ప‌వ‌న్ మీటింగ్ 

కేవ‌లం రాష్ట్రంలోని విప‌క్షాల‌ను క‌ట్ట‌డీ చేసేలా ఏపీ స‌ర్కార్ జీవోను విడుద‌ల చేసింద‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న త‌రుణంలో రాజ‌కీయ పార్టీలు స‌భ‌లు, స‌మావేశాలు, రోడ్ షోల‌ను పెట్టుకోవ‌డం స‌హ‌జం. ప్ర‌మాదవ‌శాత్తు కొన్ని దుర‌దృష్ట సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం గతంలోనూ చూశాం. ఎప్పుడూ విప‌క్ష పార్టీల ప్ర‌చారాన్ని అడ్డుకుంటే జీవోలు తీసుకురాలేదు. కానీ, ఏపీ చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోలేని విధంగా బ్రిటీస్ చ‌ట్టాల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దును పెట్టారు. ఆయ‌న తీసుకొచ్చిన చీక‌టీ జీవోను ప్ర‌తిఘ‌టిస్తూ క్షేత్ర‌స్థాయి పోరాటానికి చంద్ర‌బాబు సిద్ధమ‌య్యారు. ఆ త‌రువాత ఇలాంటి ప‌రిస్థితి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వ‌స్తోంది. జ‌న‌వ‌రి 12న శ్రీకాకుళం జిల్లాలోని ర‌ణ‌స్థ‌లం వ‌ద్ద యువ‌శ‌క్తి మీటింగ్ జ‌న‌సేనాని ప‌వ‌న్ పెట్ట‌బోతున్నారు. ఆ రోజు ఏపీ ప్ర‌భుత్వం(AP Tours) ఏమి చేస్తుంది? అనేది చూడాలి.

Also Read : Union Home Minister Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వాయిదా