NTR Centenary Celebration: జూనియర్ కు అగ్నిపరీక్ష, ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు రేపే

స్వర్గీయ  NTR శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న (శనివారం)జరుగు వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు. ఇంత కాలం పిలవలేదని ఆయన అభిమానుల్లో ఉండేది.

  • Written By:
  • Updated On - May 19, 2023 / 06:09 PM IST

NTR Centenary Celebration : జూనియర్ టీడీపీ తో ఉంటారా? దూరమా? అనేది తేలనుంది. అధినేత చంద్రబాబు విసిరిన వలలో చిక్కారు. స్వర్గీయ  NTR శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న (శనివారం)జరుగు వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు. ఇంత కాలం పిలవలేదని ఆయన అభిమానుల్లో ఉండేది. ఇప్పుడు తప్పించుకోలేని విధంగా జునియర్ పరిస్థితి ఉంది. మద్యే మార్గంగా సందేశం పంపుతారని తెలుస్తుంది. బిజీ షెడ్యూల్ క్రమంలో సందేశం తయారు చేస్తున్నట్టు జూనియర్ అభిమానుల్లోని చర్చ.  అదే జరిగితే గైర్హాజర్ సీరియస్ ఉండదని భావిస్తున్నారు.

చంద్రబాబు వేదికను పంచుకోవడానికి జూనియర్ ఇష్టపడటం లేదు. ఇటీవల తారక రత్న మరిణిచిన సందర్భంగా లోకేష్ ఉన్న ప్రదేశం కు దగ్గరగా కూడా ఉండడానికి ఇష్టపడకుండా దూరం జరిగిన వీడియో వైరల్ అయింది. దాన్ని ఉదాహరణగా తీసుకుంటే నారా, జూనియర్ మధ్య గ్యాప్ చాలా ఉందని తెలుస్తోంది.

శత జయంతిని ఘనంగా టీడీపీ నిర్వహిస్తుంది. ఇటీవల విజయవాడలో వేడుకలు పెట్టారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు విజన్ గురించి ప్రసంచించారు. దీంతో వైసీపీ రాద్ధాంతం చేసింది. ఇప్పటికీ ఆ ప్రకంపనలు తగ్గలేదు. ఇప్పడు హైద్రాబాద్ కేంద్రంగా వేడుకలు జూనియర్ చుట్టూ తిరుగుతిన్నాయి.

ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 20న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు జరుగనున్నాయి.
ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్‌ (NTR) లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశంపార్టీ  జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుగారు హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నటడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు.

ఈ వేడుకలలో భాగంగా ఎన్టీఆర్‌ (NTR) సమగ్ర సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, పాత్రికేయులు, సహచర రాజకీయ నాయకులు, వివిధ పార్టీల నేతలు, ఎడిటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు,  ప్రత్యేకంగా రాసిన వ్యాసాలను సంకలనం చేసిన ‘శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్‌ను, అదేవిధంగా ఎన్టీఆర్‌ (NTR) సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరించబడతాయి.

కాగా, ఈ వేడుకలలో ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌’గా హర్యానా గవర్నర్‌  బండారు దత్తాత్రేయ గారు, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా  సీపీఎం జాతీయ సెక్రటరీ  సీతారామ్‌ ఏచూరి , బీజేపీ జాతీయ నేత శ్రీమతి పురందీశ్వరి, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ , కన్నడ చిత్ర హీరో శివకుమార్‌,  ప్రముఖ తెలుగు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ , ప్రభాస్‌ ,  దగ్గుబాటి వెంకటేష్‌ , సుమన్‌ ,   మురళీమోహన్‌ నందమూరి కళ్యాణ్‌రామ్‌ , ప్రముఖ హీరోయిన్‌, మాజీ పార్లమెంట్‌ సభ్యులు  జయప్రద , ప్రముఖ దర్శకుడు  కె. రాఘవేంద్రరావు గారు, ప్రముఖ నిర్మాతలు జి. ఆదిశేషగిరి రావు , సి. అశ్వనీదత్‌ ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో సావనీర్‌, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది. ఇలాంటి సినీ, రాజకీయ వేడుకలకు జూనియర్ వస్తాడా?అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Also Read:  Avinash Reddy Story: అమ్మ దొంగా.. అవినాష్!మే 26కథ అదేనా!