Kutami Govt : కూటమి స‌ర్కారుపై వ్య‌తిరేక‌త పెరిగిందనేది పచ్చి అబద్దం !!

Kutami Govt : ముఖ్యంగా సూపర్ సిక్స్ (Super Six) సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అంచనాలు ఉన్నప్పటికీ, వాటి అమలుపై వారు ఓపికగా ఎదురుచూడడం గమనార్హం

Published By: HashtagU Telugu Desk
YCP

YCP

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (Kutami Govt) పాలన ప్రారంభించి సంవత్సరం పూర్తవుతున్న వేళ, ప్రజలు దీనిపై విశ్వాసంతో ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ సిక్స్ (Super Six) సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అంచనాలు ఉన్నప్పటికీ, వాటి అమలుపై వారు ఓపికగా ఎదురుచూడడం గమనార్హం. రహదారుల అభివృద్ధి, అన్నా క్యాంటీన్‌ల పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ప్రజలు కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే భావనతో ముందుకుసాగుతున్నారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్ర‌మాణానికి ఏడాది.. జనసేన ఆసక్తికరమైన వీడియో

ఇదిలా ఉంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ మద్య పదే పదే మీడియా సమావేశాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల్లో నిజంగా అలాంటి అసంతృప్తి లేదన్న విషయం తాజా సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి ఏ రాష్ట్రంలో అయినా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వ్యతిరేకత పెరగడం అసాధ్యమే. పైగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ పరిస్థితిని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.

Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్

పాలకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై ప్రజలు భారీ నమ్మకంతో ఉన్నారు. వీరు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ప్రజలు అధికారంలో ఉన్న కూటమిని గట్టిగా పరిశీలిస్తున్నా, ఇప్పటివరకు వ్యతిరేకత ఏమాత్రం కనిపించడంలేదు. దీంతో ముందున్న ఏడాదిపై ప్రజల్లో ఆశలు పెరిగినప్పటికీ, ఇప్పటి వరకు ఉన్న పాలన పట్ల సంతృప్తి వ్యక్తమవుతోందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

  Last Updated: 12 Jun 2025, 01:36 PM IST