Casino Row:’కొడాలి’ పై విపక్షాల కేక

విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 05:40 PM IST

విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కె కన్వెన్షన్ లో జరిగిన గోవా తరహా వ్యవహారంపై మండిపడుతున్నారు. ఏపీ సంస్కృతిని పాడు చేస్తున్న కొడాలి పై చర్యలు తీసుకోవాలని టీడీపీ, బీజేపీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.
క్యాసినో కల్చర్‌ ను తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ విమర్శలు గుప్పించాయి. మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కి చెందిన కె కన్వెన్షన్ హాల్‌లో క్యాసినో తరహా జూదం నిర్వహించినట్లు వెలుగులోకి వచ్చింది. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న వేళ టీడీపీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత వర్ల రామయ్య కాసినో నిర్వహం పై గళం ఎత్తాడు. సాంప్రదాయ పద్ధతి భిన్నంగా , YSRCమంత్రులే రాష్ట్రంలో కాసినోలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజం ఎత్తాడు.
‘‘ఒక మంత్రికి చెందిన సమావేశ మందిరంలో సంక్రాంతి సంబరాల్లో రూ.వందల కోట్ల నగదు మార్పిడి జరిగింది. మంత్రిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని రామయ్య ప్రశ్నించారు.జూదం ఆడుతున్న నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసు శాఖపై కూడా రామయ్య మండిపడ్డారు.
అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మౌనం వహించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ..ఇది ఉద్దేశపూర్వకంగానే సంక్రాంతి పండుగను చెడగొట్టే ప్రయత్నమని కొడాలి నాని అనడం గమనార్హం. మొత్తం మీద పండుగ ముగిసిన తరువాత కాసినో హీట్ ఏపీలో పెరిగింది.