Operation Vijayawada : జేపీ,వంగ‌వీటిపై YCP గురి

ఏపీ పాలిటిక్స్ (Operation Vijayawada) అనుహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. ఏ రోజు ఎటువైపు మ‌ళ్లుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది.

  • Written By:
  • Updated On - August 10, 2023 / 02:11 PM IST

ఏపీ పాలిటిక్స్ (Operation Vijayawada) అనుహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. ఏ రోజు ఎటువైపు మ‌ళ్లుతుందో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని టాక్‌. ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కోసం చాలా కాలంగా వేచిచూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆశించి భంగ‌ప‌డిన త‌రువాత వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరారు. అయితే, తెలుగుదేశం పార్టీ పెద్ద‌గా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేద‌ని అనుచ‌రుల అభిప్రాయం. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి టిక్కెట్ ఇవ్వ‌లేన‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని చూసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై (Operation Vijayawada)

ఇటీవ‌ల వంగ‌వీటి రాధ‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని ర‌హ‌స్యంగా (Operation Vijayawada)భేటీ అయ్యారు. వాళ్లిద్ద‌రూ పూర్వం నుంచి స్నేహితులు. రాజ‌కీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ స్నేహానికి ఏ మాత్రం భంగం క‌ల‌గ‌కుండా మెలుగుతుంటారు. ఈసారి ఎలాగైనా గుడివాడ‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా వంగ‌వీటి రాధాను రంగంలోకి దించాల‌ని చంద్ర‌బాబు ఒకానొక సంద‌ర్భంలో భావించారు. ఆ మేర‌కు గుడివాడ‌కు రాధాను కూడా పంపార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం. స‌హ‌చ‌రుల‌తో మీటింగ్ పెట్టుకున్న రాధా ఆ త‌రువాత మౌనంగా ఉన్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేస్తాన‌ని టీడీపీ అధిష్టానం వ‌ద్ద ప్ర‌తిపాద‌న ఉంచిన‌ట్టు తెలుస్తోంది. అయితే, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అక్క‌డ నుంచి ఉన్నారు. ఆయ‌న్ను కాద‌ని టిక్కెట్ ఇవ్వ‌లేన‌ని చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చార‌ట‌. అందుకే, జ‌న‌సేన వైపు ఆలోచిస్తున్నార‌ని టాక్‌.

వంగ‌వీటి రాధ‌, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు ర‌హ‌స్యంగా భేటీ

విజ‌య‌వాడ మీద వంగ‌వీటి (Operation Vijayawada) ప్ర‌భావం ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల రాధా రాజ‌కీయంగా కుదురుకోలేక‌పోతున్నారు. ఆయ‌న 2004 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ తూర్పు నుంచి పోటీచేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ త‌రువాత ప్ర‌జారాజ్యం పార్టీలో 2008లో చేరి, 2009 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల నాటికి వైసీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి మ‌రోసారి ఓడిపోయారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిక్కెట్ ఇవ్వ‌డానికి 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. అంతేకాదు, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టిక్కెట్ కూడా ఇవ్వ‌డానికి అంగీక‌రించ‌లేదు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందుగా తెలుగుదేశం పార్టీ వైపు వ‌చ్చారు. అప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ చురుగ్గా ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Also Read : Chiranjeevi Vs YCP : వైసీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారా..?

మాజీ మంత్రి కొడాలి నానితో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా వైసీపీ వైపు రాధా (Operation Vijayawada)వెళ‌తార‌ని విజ‌య‌వాడ స‌ర్కిల్స్ లోని టాక్‌. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం న‌చ్చ‌క పార్టీని వీడాన‌ని చెప్పిన రాధా తిరిగి అక్క‌డే వెళ‌తారా? అనే ప్ర‌శ్న కూడా ఆయ‌న అభిమానుల నుంచి వ‌స్తోంది. ప్రత్యామ్నాయంగా జ‌న‌సేన పార్టీలో చేర‌తారా? అనే టాక్ కూడా ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న కోరుకున్న చోట టిక్కెట్ ఇచ్చే పార్టీ జ‌న‌సేన మాత్ర‌మే. పైగా టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఉంటాయ‌ని ప్ర‌చారం బ‌లంగా ఉంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలోనూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య ఒక అవ‌గాహ‌న ఉంద‌ని అంత‌ర్గ‌తంగా న‌డుస్తోన్న చ‌ర్చ‌. ఆ క్ర‌మంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌పున రాధా పోటీకి దిగుతారా? అంటే కాద‌ని కొంద‌రు అంటున్నారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి టీడీపీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ప్రోద్బ‌లంతో జ‌న‌సేన‌లోకి వెళ్లే ప‌రిస్థితి ఉండ‌దు.

Also Read : Jagan Temper : ఏపీలో పొలిటిక‌ల్ హై టెంప‌ర్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వంగ‌వీటి రాధా ప్ర‌భావం ఎంతో కొంత ఉంటుంది. అందుకే, వైసీపీ ఆయ‌న్ను ఆక‌ర్షిస్తోంద‌ని తెలుస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి క‌లిసి రాధాను వైసీపీలోకి తీసుకొస్తున్నార‌ని ఆ పార్టీలోని అంత‌ర్గ‌త టాక్‌. విజ‌య‌వాడ ఎంపీగా జ‌యప్రకాష్ నారాయ‌ణ అభ్య‌ర్థిత్వాన్ని వైసీపీ ఖ‌రారు చేయ‌నుంద‌ని కూడా తాజాగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాల కాంబినేష‌న్ విజ‌య‌వాడ మీద బాగా క‌లిసొస్తుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్వేల్లోని (Operation Vijayawada) సారాంశ‌మ‌ట‌. అందుకే, రాధాను ఎలాగైనా వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్య‌త‌ను కొడాలి, పేర్నికి అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. ఆ దిశ‌గా అడుగులు రాధా వేస్తోన్న క్ర‌మంలో కీల‌క ప‌రిణామం విజ‌య‌వాడ కేంద్రంగా చోటుచేసుకోనుంది.ఆంత‌రంగీకుల‌తో స‌మావేశ‌మైన రాధా కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.