Site icon HashtagU Telugu

Operation JD: సైకిల్ వైపు CBI మాజీ జేడీ న‌డ‌త‌

Operation Jd

Operation Jd

సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ(Operation JD) రాజ‌కీయాల్లో ప్ర‌తి రోజూ న్యూస్ మేక‌ర్ గా నిలుస్తున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు దాకా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధైర్యాన్ని, పాల‌న‌ను మెచ్చుకున్నారు. చుక్క‌ల భూముల‌కు క్లియెరెన్స్ ఇవ్వ‌డంపై ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా చంద్ర‌బాబు(Chandrababu) ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. అంటే, ఆయ‌న రాజ‌కీయ చౌర‌స్తా నుంచి ఏదో ఒక గ‌ట్టుకు చేరుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ  న్యూస్ మేక‌ర్ గా (Operation JD)

క్విడ్ ప్రో కో కేసుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల‌పై వేసిన కేసు విచార‌ణ సంద‌ర్భంగా ల‌క్ష్మీనారాయ‌ణ(Operation JD) తెలుగు ప్ర‌జ‌ల‌కు హీరోగా క‌నిపించారు. విచార‌ణ సంద‌ర్భంగా టీడీపీ ముద్ర‌ను వేయించుకున్నారు. ఆనాడు విచార‌ణ పూర్తి వివ‌రాల‌ను టీడీపీకి అంద‌చేస్తున్నార‌ని వైసీపీ చేసిన ఆరోప‌ణ‌. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్థ‌న్ రెడ్డిని అరెస్ట్ చేసిన తీరు ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని(Jagan mohan Reddy) జైలుకు పంపారు. ఈ రెండు కేసుల‌తో యువ‌త ఐకాన్ గా ఆయ‌న నిలిచారు. సీన్ క‌ట్ చేస్తే, ప్ర‌స్తుతం ల‌క్ష్మీనారాయ‌ణ రెంటీకి చెడ్డ రేవ‌డి మాదిరిగా అంటు సీబీఐ విధుల‌కు ఇటు రాజ‌కీయంకు దూరంగా ఉన్నార‌ని చెప్పొచ్చు. కానీ, ఏదో ఒక. పార్టీలో చేరాల‌ని ఆరాట‌ప‌డుతున్నార‌ని మాత్రం ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ నాన్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ అంటూ

జ‌న‌సేన పార్టీ త‌ర‌పున 2019 ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా పోటీ చేశారు వీవీ.(Operation JD) ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ నాన్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ అంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నార‌ని ప్ర‌చారం మొద‌లైయింది. దానికి అనుగుణంగా జ‌గన్మోహ‌న్ రెడ్డి(Jagan mohan Reddy) ప‌రిపాల‌న సామ‌ర్థ్యం, ఆయ‌న డేరింగ్ ను మెచ్చుకున్నారు. ఇంకేముంది ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీకి వెళుతున్నార‌ని న‌మ్మారు. కానీ, అక్క‌డి ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న్ను తీసుకోవ‌డానికి వైసీపీ ఆచితూచి అడుగువేస్తోంది. అయిన‌ప్పటికీ ఆ పార్టీని ఆక‌ర్షించ‌డానికి అనువైన ప‌ద్దతుల్లో మీడియా స్టేట్మెంలు ఇస్తున్నారు. రెండో రోజుల క్రితం జ‌రిగిన చుక్క‌ల భూముల రిజస్ట్రేష‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ప్ర‌త్యేకంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అభినంద‌న‌లు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ ప‌క్షాన నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నం మొద‌లు

తాజాగా చంద్ర‌బాబు (Chandrababu)ఎప్పుడో ప్ర‌తిపాదించిన రూ. 2వేల నోటు ర‌ద్దుకు మ‌ద్ధ‌తు ప‌లుకుతూ ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌క‌ట‌న చేశారు. బ్లాక్ మ‌నీ, అవినీతి నిర్మూల‌న‌కు చంద్ర‌బాబు చేసిన ప్ర‌తిపాద‌న మంచిద‌ని అన్నారు. దీంతో టీడీపీ వైపు ల‌క్ష్మీనారాయ‌ణ (Operation JD) చూస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైయింది. ఒక‌ప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ గా ప‌నిచేసిన రోజుల్లో ఆయ‌న‌కు టీడీపీ ముద్ర ఉంది. ఆ త‌రువాత సామాజిక‌వ‌ర్గం ప‌రంగా జ‌న‌సేన‌లోకి వెళ్లారు. కానీ, ఇప్పుడు వైసీపీ రాజ‌కీయ టేస్ట్ చూడాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ విఫ‌లం అయ్యార‌ని తెలుస్తోంది. అందుకే, టీడీపీ ప‌క్షాన నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టార‌ని టాక్‌.

Also Read : TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన

వాస్త‌వంగా విశాఖ ఎంపీ అభ్య‌ర్థిగా బాల‌క్రిష్ణ రెండో అల్లుడు భ‌ర‌త్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు. ఆ స్థానం ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇవ్వ‌రు. కానీ, ఏదో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టిక్కెట్ ఇవ్వ‌డానికి టీడీపీకి అవ‌కాశం ఉంది. అందుకు ల‌క్ష్మీనారాయ‌ణ(Operation JD) అంగీక‌రిస్తారా? అనేది ప్ర‌శ్న‌. ఆయ‌న తొలి నుంచి కేంద్ర రాజ‌కీయాల్లో ఎంట‌ర్ కావాల‌ని భావిస్తున్నారు. అందుకే, ఎంపీగా పోటీ చేయ‌డానికి ఇట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల ప్ర‌జాశాంతి పార్టీలోకి వెళ‌తార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, కేఏ పాల్ తో భేటీ వెనుక విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ అంశం ఉంద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న తాజాగా టీడీపీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది.

Also Read : CBN Demand : క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ఎఫెక్ట్ ! చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బీజేపీ దూత‌లు.?