Operation INDIA : చంద్ర‌బాబుకు ‘ఇండియా’ గాలం

జాతీయ స్థాయిలో (Operation INDIA)చక్రం తిప్పిన లీడ‌ర్ చంద్ర‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏపీ వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు.

  • Written By:
  • Updated On - July 20, 2023 / 02:57 PM IST

జాతీయ స్థాయిలో (Operation INDIA)చక్రం తిప్పిన లీడ‌ర్ చంద్ర‌బాబు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏపీ వ‌ర‌కు ప‌రిమితం అయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న నాయ‌కత్వాన్ని ఇండియాగా రూపాంత‌రం చెందిన యూపీఏ-3 కోరుకుంటోంది. దానిలో కీల‌క లీడ‌ర్లు నితీష్‌, మ‌మ‌తల‌కు అత్యంత స‌న్నిహితుడు చంద్ర‌బాబు. అందుకే, చంద్ర‌బాబు కోసం వాళ్లిద్ద‌రూ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, రాష్ట్ర భ‌విష్య‌త్ దృష్ట్యా ఆచితూచి అడుగువేస్తున్నారు.

నితీష్‌, మ‌మ‌తల‌కు అత్యంత స‌న్నిహితుడు చంద్ర‌బాబు(Operation INDIA)

ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఆ స‌మ‌యంలో రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన మంత్రుల‌ను ఎంపిక చేసే కీల‌క లీడ‌ర్ గా చంద్ర‌బాబు మెలిగారు. ఆ ఇమేజ్ ఇప్ప‌టికీ ఆయ‌న‌కు ఢిల్లీ స్థాయిలో ఉంది. ఎన్డీయే ప‌క్షాల‌కు ఆయ‌న బ‌లం ఏమిటో తెలుసు. అలాగే, యూపీఏ ప‌క్షాల‌కు కూడా అవగాహ‌న లేక‌పోలేదు. ఢిల్లీ వైపు అడుగులు వేయాల‌ని మోడీతో పాటు కాంగ్రెస్ లీడ‌ర్లు కేవీపీ, రేణుకాచౌద‌రి త‌దిత‌రులు కోరుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన ఆజాదీకా అమృత‌మ‌హోత్స‌వ సంద‌ర్బంగా ఢిల్లీకి అప్పుడ‌ప్పుడు వ‌స్తుండాలని చంద్ర‌బాబుకు మోడీ సూచించారు. ప్ర‌స్తుతం దేశం ఉన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు జాతీయ రాజ‌కీయాల వైపు (Operation INDIA)ఆలోచించాల‌ని కాంగ్రెస్ మాజీ ఎంపీ, వైఎస్ ఆత్మ కేవీపీ కోరుతున్నారు.

విప‌క్ష కూట‌మిలోనూ ప్ర‌త్యేక హోదాను పెట్ట‌డం ద్వారా చంద్ర‌బాబును ఆక‌ర్షించాల‌ని

ఇక జాతీయ స్థాయిలోని విప‌క్ష కూట‌మి కీల‌క లీడ‌ర్లుగా ఉన్న నితీష్‌కు చంద్ర‌బాబు స‌మ‌ర్థ‌త ఏమిటో తెలుసు. ఆయ‌న‌తో ఇప్ప‌టికే మంత‌నాలు సాగించిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ప్ర‌త్యేక హోదాను కూడా విప‌క్ష కూట‌మిలో పెట్టే ప్ర‌తిపాద‌న చేశార‌ని వినికిడి. ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌నంటోంది. ముగిసిన అధ్యాయంగా ప్ర‌త్యేక హోదాను వ‌ర్ణిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదాతో పాటుగా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌న్నింటికీ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతోంది. ఆ మేర‌కు రాహుల్ గాంధీ ప‌లు వేదిక‌ల‌పై చెప్పారు. ఇటీవ‌ల చేసిన భార‌త్ జోడో యాత్ర‌లోనూ ప్ర‌త్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పుడు విప‌క్ష కూట‌మిలోనూ ప్ర‌త్యేక హోదాను పెట్ట‌డం ద్వారా చంద్ర‌బాబును ఆక‌ర్షించాల‌ని నితీష్ ప్ర‌తిపాదిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే త‌ర‌హాలో మ‌మ‌త కూడా ఎలాగైనా చంద్రబాబును విప‌క్ష కూట‌మి (Operation INDIA) వైపు ఆక‌ర్షించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం.

రాబోవు రోజుల్లో విప‌క్ష కూట‌మిలోకి ఎంఐఎం

జాతీయ స్థాయి రాజ‌కీయాల‌ను ప్ర‌స్తుతం గ‌మ‌నిస్తే, 26 పార్టీల‌తో కూడిన విప‌క్ష కూట‌మి బ‌లంగా ఉంది. పోటీగా 39 పార్టీల‌తో స‌మావేశాన్ని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన పార్టీలు పెద్ద‌గా లేవు. జ‌న‌సేన లాంటి రిజిస్ట్ర‌ర్ పార్టీలు మాత్ర‌మే ఎన్డీయేలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో బ‌ల‌మైన పార్టీలున్న విప‌క్ష కూట‌మి సంఖ్య 30 వ‌ర‌కు చేరే అవాకాశం ఉంది. తెలంగాణ‌లోని ఎంఐఎం పార్టీ కూడా విప‌క్ష కూట‌మిలో చేర‌డానికి ఉత్సాహంగా ఉంది. ఆహ్వానం పంప‌కపోవ‌డాన్ని ఆ పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ సీరియ‌స్ గా తీసుకున్నారు. అంట‌రాని పార్టీ విప‌క్ష కూట‌మి ఎంఐఎంను ఎందుకు చేసిందంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఆ క్ర‌మంలో రాబోవు రోజుల్లో విప‌క్ష కూట‌మిలోకి ఎంఐఎం కూడా చేరే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే, తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ చిత్రం కొంత మార‌డానికి అవ‌కాశం ఉంది. అప్పుడు చంద్ర‌బాబు విప‌క్ష కూట‌మి (Operation INDIA)వైపు చూస్తార‌ని నితీష్‌, మ‌మ‌త భావిస్తున్నార‌ట‌.

Aslo Read : Delhi Secret : చంద్ర‌బాబుకు NDA ఆహ్వానం లేక‌పోవ‌డం వెనుక కార‌ణ‌మిదే.!

ప్ర‌స్తుతం ఎన్డీయే, విప‌క్ష కూటముల్లో 65 పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేలో 39 పార్టీలు, విప‌క్ష కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఇంకా 11 పార్టీలు మాత్రం ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్నాయి. వీటిలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎంలతో పాటు బిజూ జనతాదళ్, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (ఎస్), ఏఐయూడీఎఫ్, ఆర్ఎల్పీ, శిరోమణి అకాలీదళ్ (మాన్) ఉన్నాయి. ఈ పార్టీలకు 91 మంది ఎంపీల బలం ఉంది. ఆ పార్టీలు మొగ్గుచూపే వైపు రాబోవు ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అనుకూలంగా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే, జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న చంద్ర‌బాబును ఆక‌ర్షించ‌గ‌లిగితే, రాబోవు రోజుల్లో ఎన్డీయేను తేలిగ్గా ఎదుర్కోవ‌చ్చ‌ని పాత మిత్రులు నితీష్‌, మ‌మ‌త భావిస్తున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్.

Also Read : NDA Meeting : ఎన్డీఏకు 25 ఏళ్ళు.. దేశ హితం కోసం ఎవరైనా ఎన్డీఏలో చేరొచ్చు.. మీటింగ్‌పై JP నడ్డా కామెంట్స్..

జాతీయ స్థాయి కంటే రాష్ట్ర ప‌రిధిలోని రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ తో క‌లిసి 2018, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌నిచేసింది. దీంతో ఆ ఎన్నిక‌ల్లో ఘోరంగా టీడీపీ న‌ష్ట‌పోయింది. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పుట్గిన పార్టీ టీడీపీ. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం కోలుకోని విధంగా న‌ష్ట‌పోయింది. ఆ అనుభ‌వం దృష్ట్యా కాంగ్రెస్ తో మ‌రోసారి క‌లిసి వెళ్ల‌డానికి చంద్ర‌బాబు సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. అయితే, విప‌క్ష కూట‌మితో పొత్తు అనే సంకేతం ఇస్తూ వెళితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న టీడీపీ చేస్తోందని వినికిడి. స‌మీప భ‌విష్య‌త్ లో విపక్ష కూట‌మి(ఇండియా) వైపు చంద్ర‌బాబును ఆక‌ర్షించ‌వానికి మ‌మ‌త‌, నితీష్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్డీయే స‌మావేశానికి ఆహ్వానం అందుకోలేని చంద్ర‌బాబు విలువ తెలిసిన‌ విపక్ష కూట‌మి ఆయ‌న కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది.