ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదు : పేర్ని నాని

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని చెప్పారు.

  • Written By:
  • Updated On - September 30, 2021 / 01:53 PM IST

జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసమే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ తీసుకొచ్చిందని, ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాపై ప్రభుత్వ పెద్దల పెత్తనమేంటీ? అని ప్రశ్నించారు. ఈ వాఖ్యలు ఏపీలో తీవ్ర సంచనలం రేపాయి. పవన్ పై వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ మంత్రులు సైతం ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రి పేర్ని నాని, పొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి మరోసారి మీడియా ముందుకొచ్చారు.

సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నంలో బుధవారం తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి చెప్పారు. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని మంత్రి నాని తెలిపారు. కరోనాతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటివరకు థియేటర్‌లో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాల్సిందిగా కోరారని వెల్లడించారు.

అయితే గతకొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ పై నటుడు పోసాని తీవ్ర వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదారబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. దీనికి బదులుగా పవన్ ఫ్యాన్ పోసానిపై ఎదురుదాడికి దిగారు. పోసాని బయటఅడుపెట్టనివ్వబోమని జనసైనికులు హెచ్చరించారు. పోసాని తీరును ఎండగడుతూ పవన్ ఫ్యాన్ గురువారం పోసాని ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఈ వ్యవహరం చూస్తుంటే మరింత ముదరుతోంది. ఇటు సినీపెద్దలు, అటు అధికార పార్టీలు నేతలు ఏకాభిప్రాయానికి వస్తేనే ఈ సమస్య సద్దుమణగదని భావించవచ్చు.