Magunta: టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

  Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా […]

Published By: HashtagU Telugu Desk
Ongole Mp Magunta Srinivasu

Ongole Mp Magunta Srinivasu

 

Magunta Sreenivasulu Reddy: చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ(Magunta Raghava) ఈరోజు టీడీపీ(tdp)లో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నేడు ఒక శుభదినం అని, ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదని అన్నారు. రేపు ఆదివారం నాడు ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట బహిరంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో నిన్నటిదాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు. కానీ నాలాంటి వాడు తెగించాడు… నేను కూడా భయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

read also: Family Star: ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కంప్లీట్.. విజయ్ దేవరకొండ క్రేజీ అప్డేట్!

కాగా, గౌరవం లేని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొంటూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలులో గతంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ అనివార్య పరిస్థితుల్లో తాను వైఎస్సార్‌సీపీని వీడాల్సి వచ్చిందన్నారు. “ఇది విచారకరమైన పరిణామం, కానీ నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడలేను” అని మాగుంట అన్నారు.

 

  Last Updated: 16 Mar 2024, 06:45 PM IST