Bomb Threats In Tirumala: తిరుమలలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats In Tirumala) వచ్చాయి. అలిపిరి పీఎస్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటళ్లలో బాంబులు పెట్టామంటూ ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఈ హోటళ్లలో రష్యా, మలేషియాకు చెందిన విదేశీ మహిళలు ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో వచ్చిన మెయిల్ ని మరోసారి రీసెండ్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడుతో పాటు తిరుపతికి చెందిన నాలుగు హోటల్స్ లో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. రెండు రోజుల క్రితం వచ్చిన మెయిల్‌నే మరోసారి రీసెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే తిరుపతిలో ఇటీవల నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.హోటళ్లలో బాంబులు ఉన్నట్లు అర్ధరాత్రి మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీ చేపట్టారు. హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే హోటళల్లో ఏమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు సైతం బందోబస్తు పటిష్టం చేస్తున్నారు.
Also Read: Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రేషన్ కార్డులపై కీలక నిర్ణయం!
లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటళ్లకు ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్, డాగ్స్‌తో తనిఖీలు చేశారు. అయితే గత కొద్దీ రోజులగా బాంబు బెదిరింపుల మెయిల్స్, కాల్స్, సందేశాలు సర్వసాధారణమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విమానాయన సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ఈ ఫేక్ కాల్స్‌ను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.