Site icon HashtagU Telugu

NTR Coins Viral : నేడే ‘ఎన్టీఆర్ కాయిన్’ విడుదల.. విశేషాలివీ..

NTR Coins Viral

Ntr Coin

NTR Coins Viral :  స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR ) 100వ జయంతి ఉత్సవాల సంవత్సరం ఇది.. ఆయన 1923లో మే 28న జన్మించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ గౌరవార్ధం  100 శాతం మెటల్ తో తయారుచేసిన  100 రూపాయల నాణేన్ని కేంద్ర ప్రభుత్వం  ఇవాళ (ఆగస్టు 28న) రిలీజ్ చేయబోతోంది. ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే ఎవరెవరు హాజరవుతారనేది వేచి చూడాలి.

Also read : Electric Flex Fuel Vehicle : ఆ టెక్నాలజీతో ప్రపంచంలోనే తొలికారు.. 29న ఇండియాలో రిలీజ్.. విశేషాలివీ..

ఈ నాణెంలో 50 శాతం సిల్వర్, 40 శాతం కాపర్, చెరో 5 శాతం నికెల్, జింక్ లోహాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నాణేల నమూనా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   ఎన్టీఆర్ కాయిన్ లో ఓ వైపు 3 సింహాలు, అశోక చక్రం ఉంటాయి. కాయిన్ లో మరోవైపు ఎన్టీఆర్ ఫొటో, దాని కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో అక్షరాలతో పాటు 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది. ఈ కాయిన్ ను (NTR Coins Viral) హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే  ప్రింట్ చేయించడం విశేషం. అయితే ఈ కాయిన్ పై ప్రింట్ చేయించిన ఎన్టీఆర్ ఫోటోను కూడా ఆయన కుటుంబ సభ్యులే సెలెక్ట్ చేసి అందించారు.