Rains : ముంచుకొస్తొన్న ‘జవాద్’ తుఫాను.. ఉత్తరాంధ్ర అధికారులు అలర్ట్!

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. నేటికీ తోతట్టు ప్రాంతాలు నీటిలోని మునిగి దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. జవాద్ రూపంలో మరో ముప్పు రానుంది.

Published By: HashtagU Telugu Desk
Andhra

Andhra

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. నేటికీ తోతట్టు ప్రాంతాలు నీటిలోని మునిగి దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. జవాద్ రూపంలో మరో ముప్పు రానుంది. ఉత్తరాంధ్ర కు భారీ వర్ష సూచన ఉండటంతో అక్కడి అధికారులు అప్రమత్తయ్యారు. తీర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచనతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం తమ తమ కలెక్టర్ల కార్యాలయాలు, అన్ని కోస్తా మండల ప్రధాన కార్యాలయాలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వర్షాల పరిస్థితిని, భారీ నష్టాన్ని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌లు (విజయనగరం-08922-276888) (శ్రీకాకుళం-08942-240557) పనిచేస్తాయి. IMD యొక్క తాజా బులెటిన్ ప్రకారం.. మిడ్ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉన్న తుఫానుగా మారే ప్రమాదం ఉంది. అల్ప పీడనం బలపడి డిసెంబర్ 4, 2021 శనివారం నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి.

భారీ వర్షాలు కాకుండా, గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం కలెక్టర్ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ భారీ వర్షాల ప్రభావంతో నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఐఎండీ వాతావరణ బులెటిన్‌ల ప్రకారం సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని భోగాపురం, పూసపాటి రేగ మండలాల మత్స్యకారులు వచ్చే మూడు రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని ఆమె సూచించారు.

విజయనగరం కలెక్టర్ G.C. కిషోర్‌కుమార్‌ రెండు మండలాల్లోని తీర గ్రామాలను సందర్శించి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వసతి, ఆహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టర్‌ శ్రీకేష్‌ బి. లఠ్కర్‌ మాట్లాడుతూ ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు మండలాల్లో 180 కి.మీ తీర ప్రాంతాల్లో స్థానిక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ హెచ్చరికతో ఊహించిన సంక్షోభాన్ని సీనియర్ అధికారుల బృందం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు.

  Last Updated: 02 Dec 2021, 02:15 PM IST