Site icon HashtagU Telugu

AP Jobs : వైజాగ్‌లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి

Job Alert

Job Alert

AP Jobs : ఆంధ్రప్రదేశ్‌లో  10వ తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశాలివి. నెలకు రూ.15వేల దాకా జీతం లభిస్తుంది. వైఎస్సార్ జిల్లా పరిధిలో రోడ్లు భవనాల శాఖలో కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 8 శానిటరీ వర్కర్ల  పోస్టులు, 6 వాచ్ మెన్ పోస్టులు, 10 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ పొందినవారికి శాలరీతో పాటు ఇంక్రిమెంట్లు కూడా ఇస్తారు.  అర్హులైన వారు  ఆఫ్‌లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ‘‘సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆర్ అండ్ బీ) సర్కిల్ కార్యాలయం, కడప, మారుతీ నగర్, వైఎస్సార్ జిల్లా’’ అడ్రస్‌కు అప్లికేషన్లను పంపాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 22.  ఈ ఉద్యోగాల(AP Jobs) నోటిఫికేషన్, అప్లికేషన్ల  వివరాలతో ముడిపడిన వివరాలను తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయంలోనూ సంప్రదించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

విశాఖపట్నంలో జాబ్స్ భర్తీ ఇలా.. 

రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర క్యాడర్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రత్యేక దృష్టిసారిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఆంధ్రా మెడికల్ కళాశాల పరిధిలోని కేజీహెచ్ తో పాటు అనుబంధ ఆసుపత్రులైన టీబీహెచ్, ఈఎన్టీ, మెంటల్ కేర్, ఆర్ సీడీ, వీజీహెచ్, కంటి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ఉద్యోగి నుంచి స్టాఫ్ నర్సు, ఇతర టెక్నీషియన్ పోస్టుల భర్తీని ఒకేసారి చేపట్టేలా నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ క్రమంలోనే మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. బుచ్చిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో 30 స్టాఫ్ నర్సులతో పాటు, ఫార్మాసిస్టులు, ఇతర నాలుగో తరగతి ఉద్యోగులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఆపరేషన్ థియేటర్లోని పలు క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Also Read : White Paper on Irrigation : ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం.. పైచేయి ఎవరిది ?

ఈ నియామకాలకు సంబంధించి ఈ నెల 13 నుంచి 20వ తేది వరకూ అర్హులైన అభ్యర్ధుల నుంచి నేరుగా దరఖాస్తులను ఆంధ్రా మెడికల్ కళాశాలలో స్వీకరిస్తున్నామన్నారు. 21 నుంచి 25వ తేది వరకూ ఆయా దరఖాస్తులను పరిశీలన చేస్తారు. ఇక 26న ప్రోవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేస్తామని, 27 నుంచి 29 వరకూ ఆయా మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు, ఇతర పత్రాలు లేని వాటిని గుర్తించి పరిశీలన చేస్తామన్నారు. మార్చి 1 వ తేదిన అన్నిక్యాడర్లుకు సంబంధించి తుది జాబితాను విడుదల చేస్తామని, మార్చి 4వ తేది నుంచి నియామక పత్రాలు అందిస్తామన్నారు. ఈ నియామకాలను ప్రభుత్వ సూచించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తూ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

Also Read : Rs 2900 Crores : ట్రంప్‌కు 2900 కోట్ల జరిమానా.. ఆయన కొడుకులకూ కోట్లకొద్దీ ఫైన్.. ఎందుకు ?